పంట కోత ప్రయోగ సి.సి.కిట్లను గణాంకాదికారులకు అందజేత-అదనపు కలెక్టర్ రమేష్

జిల్లాలో పంట దిగుబడి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రమేష్ మండల గణాంక ప్రణాళిఖాధికారులకు సూచించారు. బుధవారం తన ఛాంబర్ లో పంట కోత ప్రయోగాలకు సంబంధించిన సి.సి. కిట్ల ను (యంత్ర సామాగ్రిని ) ముఖ్య ప్రణాళికాధికారి చిన కొట్యాల్ తో కలిసి మండల ప్రణాళిక అధికారులు, గణాంకాధికారులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా అదనపవు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి రెండు చొప్పున జిల్లాకు 42 కిట్లు మంజూరు చేసిందని అన్నారు. బరువు కొలిచే యంత్రం, దిక్సూచి, టార్పాలిన్ , కిట్ బ్యాగ్, పంట కోత నమోదు కార్డు కలిగిన ఈ కిట్లను అన్ని మండలాలకు రెండు చొప్పున అందజేస్తున్నామని అన్నారు. ఇట్టి కిట్లతో పంట కోత ప్రయోగాలను సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన గణాంకాధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డివిజనల్ గణాంకాధికారి శ్రీనివాస్, వెంకటేష్, గణాంకాధికారి సుధా, మండల గణాంక ప్రణాళికాధికారులు పాల్గొన్నారు.

Share This Post