పంట నమోదు నివేదికలు రూపొందించాలి…

ప్రచురణార్థం

పంట నమోదు నివేదికలు రూపొందించాలి…

మహబూబాబాద్ డిసెంబర్ -20:

పంట నమోదు పై నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పంట లెక్కింపు నమోదుపై ముఖ్య ప్రణాళిక ,వ్యవసాయం, ఉద్యాన, నీటిపారుదల శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

పంట నమోదుపై నివేదికలు రూపొందించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అవగాహనతో, వాస్తవ సమాచారంతో నివేదికలు తయారు చేయాలన్నారు.

జిల్లాలో 288 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయని, ఆ గ్రామాల ప్రాతిపదికన పంట నమోదు నివేదికలు రూపొందించాలన్నారు.

పంట నమోదు ముందస్తు నివేదికలు ఎంతో అవసరమన్నారు.

ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి సుబ్బారావు, ఉద్యాన అధికారి సూర్యనారాయణ, వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మీనారాయణ, నీటిపారుదల డి.ఎస్.ఈ.పసందు కుమార్, ఉప గణాంక అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post