జిల్లాలో ప్రభుత్వం నుంచి వివిధ శాఖల ద్వారా రైతులకు, నిరుద్యోగ యువతకు రాయితీ నిధులు విడుదల చేసిన వెంటనే సకాలంలో రుణాలు మంజూరు చేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించాలని అదనపు కలెక్టర్ బ్యాంకు అధికారులను కోరారు. బుదవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ బ్యాంకుల అధికారులతో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశంలో రుణప్రణాళికపై రెండవ త్రైమాసిక సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాన్ని వందశాతం పూర్తిచేయాలని బ్యాంకర్లను కోరారు. లబ్ధిదారుల రుణ మంజూరులో బ్యాంక్ అదికారులు ఇబ్బందులూ లేకుండా చూడాలని సూచించారు. స్వయం ఉపాధి యూనిట్లకు రాయితీ విడుదలైన వారికి సకాలంలో మంజూరు చేసి గ్రౌండింగ్ చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలకు ప్ర భుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆదిశగా చర్యలు చేపట్టాలని అన్నారు.. 2021- 22 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో ఖరీఫ్‌లోని టార్గెట్ రూ.1935.57 కోట్ల పంట రుణాలు లక్ష్యం కాగా రూ.577.62 కోట్లు పంట రుణం కింద రైతులకు మంజూరు చేశారని చెప్పారు. జిల్లా ఋణ లక్ష్యం రూ. 4147.67కోట్లకు గాను రెండు శాతం వృద్ది సాదించి రూ. 1935.15 కోట్ల లక్ష్యం సాదించడం జరిగిందని వీటిలో అనుబంద రంగాలైన వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.850.68కోట్లు లక్ష్యం కాగా 236.53 కోట్ల అందచేసినట్లు తెలిపారు. విద్యారుణం కింద రూ.71.99కోట్లకు గాను రూ.15.79 కోట్లు, అలాగే పరిశ్రమలకు రూ. 381.18కోట్లకు రూ.293.50 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ.408.09 కోట్లకు రూ.213.48 కోట్లు రుణం అందజేసినట్లు వివరించారు. వీధి, చిరువ్యాపారులకు రుణాలు అందించాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రుణాలు అందించడంలో బ్యాంకర్ల పని తీరు ప్రశంశనియమని అభినందించారు. లబ్దిదారులకు మొండి బకాయిలను రాబట్టుటకు అనుబంధ శాఖలు బ్యాంక్ అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో LDM జగదీష్ చంద్రబోస్, AGM సత్యనారాయణ, తేజా దీప్తి, సంక్షేమ అదికారులు శంకర్, శిరీష, DAO రామారావు నాయక్, DIC తిరుపతయ్య,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


