పండగ వాతావరణంలో పాఠశాలల పున:ప్రారంభం : జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 01, 2021ఆదిలాబాదు:-

పండగ వాతావరణంలో జిల్లా వ్యాప్తంగా పాఠశాలల పునఃప్రారంభం చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఇందులో భాగంగా బుధవారం రోజున ఆదిలాబాద్ పట్టణం లోని రణదివే నగర్, ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడా లోని ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ముందుగా రణదీవెనగర్ లోని MPPS ప్రాథమిక, ZPHS ఉన్నత పాఠశాలల్లోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడుతూ, ప్రత్యేక్ష తరగతుల పై విద్యార్థుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. పదవతరగతి విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తీర్ణతలో జిల్లాను  ప్రథమ స్థానంలో ఉంచాలని ఆకాంక్షించారు. కరోనా నియమాలు పాటిస్తూ భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన తయారీ, బియ్యం స్టాక్ రూమ్ ను, ఐసోలేషన్ రూమ్ ను పరిశీలించి పాఠశాల ఉపాధ్యాయుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు యూనిఫాం, బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు బుధవారం నుండి పునః ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ, పాఠశాలలను పూర్తి స్థాయిలో నడపడం జరుగుతుందని అన్నారు.  ఉపాధ్యాయులు పాఠశాలలను పండగ వాతావరణంలో ప్రారంభించేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని, తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేవిధంగా చూడాలని సూచించారు. అనంతరం ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడా లోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను కలెక్టర్ సందర్శించి, పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన తయారీ, బియ్యం స్టాక్ రూమ్ ను, కిచన్ గార్డెన్ పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్య శాఖ అధికారి ఏ.రవీందర్ రెడ్డి, ఎంఇఓలు జయాశీల, శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయలు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post