పండుగ వాతావరణంలో దశాబ్ది వేడుకల నిర్వహించాలి….. రాష్ట్ర గిరిజన మహిళ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

ప్రచురణార్థం…….2

తేదీ.30.5.2023

పండుగ వాతావరణంలో దశాబ్ది వేడుకల నిర్వహించాలి….. రాష్ట్ర గిరిజన మహిళ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

*ప్రతి శాఖ పరిధిలో నాడు నేడు పరిస్థితులను వివరించాలి

*ప్రతి రంగంలో దేశానికే ఆదర్శవంతంగా అద్బుత ఫలితాలు సాధించాం

*నీటి పారుదల రంగంలో సాధించిన విజయాలతో విస్తృతంగా పెరిగిన సాగు విస్తీర్ణం

*ప్రజలకు భరోసా కల్పించేలా వైద్య శాఖ లో అద్బుత ప్రగతి

*కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్రామీణ అవార్డుల్లో తెలంగాణకు అగ్రస్థానం

*దేశంలో ప్రప్రథమంగా ఇంటింటికి త్రాగునీరు అందించిన మిషన్ భగీరథ

ఇతర రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులు పండించిన పంటను మద్దతు ధర పై ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది

*తెలంగాణ విజయాలను నలుదిక్కులా ఘనంగా చాటుతూ పకడ్బందీగా వేడుకల నిర్వహణ

*రాష్ట్ర దశాబ్ద వేడుకలు నిర్వహణ పై ముందస్తు సమావేశం నిర్వహించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి
——————————————–
జయశంకర్ భూపాలపల్లి, మే -30:
———————————————-
పండుగ వాతావరణంలో ఘనంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర గిరిజన మహిళ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

మంగళవారం సాయంత్రం ఇల్లందు క్లబ్ హౌస్ నందు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల పై రివ్యూ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 9 సంవత్సరాల స్వయం పాలన పూర్తి చేసుకోని 10వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి జూన్ 22 వరకు 21 రోజుల పాటు వైభవంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అన్నారు. శతాబ్ది కాలంలో జరగని అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ 9 ఏళ్ళలో సాధించిందని మంత్రి అన్నారు.

నీటిపారుదల రంగంలో, విద్యుత్తు రంగంలో సాధించిన విజయాల కారణంగా సాగు విస్తీర్ణం పెరిగిందని, పంజాబ్ కు దీటుగా నేడు తెలంగాణ లో వరి సాగు జరుగుతుందని, భూములకు భారమైన స్థాయిలో వరి పంట పండుతుందని అన్నారు.

గతంలో ప్రభుత్వ వైద్య రంగం పై ఉన్న అపోహలను తొలగిస్తు ప్రజలకు భరోసా కల్పించేలా వైద్య రంగం అభివృద్ధి చేశామని, ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు, మాతా శిశు సంరక్షణ ఆసుపత్రులు, డయాలసిస్ కేంద్రాలు, డయాగ్నొస్టిక్ హబ్, బస్తీ దవఖానాలు,పల్లె దవాఖానాలు ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, కేసిఆర్ కిట్, కంటి వెలుగు లాంటి అద్భుతమైన కార్యక్రమాలు విజయవంతం అమలు చేశామని అన్నారు.

ప్రజలకు త్రాగునీరు,విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాల పాలన ముగిసే నాటికి అన్ని రంగాల్లో సమూల మార్పులు సాధించామని, నీటి పారుదల రంగంలో సాధించిన ప్రగతికి ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెలులెత్తాయని, కరెంట్ కష్టాలతో ఇబ్బంది పడ్డ తెలంగాణ నేడు 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి అన్నారు.

విద్యారంగం, గ్రామీణాభివృద్ధి, మున్సిపాలిటీలలో అద్భుతమైన ప్రగతి సాధించామని, గ్రామీణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో తెలంగాణ రాష్ట్రం అధిక సంఖ్యలో అవార్డులు వచ్చాయని, ఇటీవల ప్రకటించిన కేంద్ర అవార్డులలో 30% మన రాష్ట్రానికి రావడం గర్వకారణమని మంత్రి తెలిపారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయడం వల్ల ప్రతి రంగంలో తెలంగాణ అద్బుత ఫలితాలు సాధించిందని, మన ప్రగతిని నలుదిక్కులా ఘనంగా చాటుతూ పకడ్బందీగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు.

రాష్ట్ర దశాబ్ది వేడుకల గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఘనంగా నిర్వహించాలని, ఎక్కడా ఎలాంటి పోరపాట్లు లేకుండా పకడ్బందీగా మన తెలంగాణ రాష్ట్ర సాధించిన విజయాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి తెలిపారు.

జిల్లాలో జరుగుతున్న వరి ధాన్యం కొనుగోలు పై ప్రతిపక్షాలు అనవసరముగా రాద్ధాంతం చేస్తున్నారని ఇతర రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులు పండించిన పంటను మద్దతు ధర పై ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని గుర్తు చేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కట్టుదిట్టంగా వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.
ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ది చేకూరిన లబ్దిదారుల వివరాలు గ్రామాల వారిగా నివేదిక తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. సంక్షేమ సంబురాలు సందర్బంగా గొర్రెల పంపిణీ రెండవ విడత, అవకాశం ఉన్న చోట భూ పట్టాల పంపిణీ , ప్రారంభిస్తామని అన్నారు.పట్టణ ప్రగతి రోజున సఫాయి కార్మికులకు సన్మానం నిర్వహించాలని, మున్సిపాల్టీలలో సఫాయిన్న సలామన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు.

భూపాలపల్లి ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు చేసిన మేలు, వారికి కల్గిన లబ్ది వివరాలు గ్రామాల వారిగా ఫ్లెక్సీలు, పోస్టర్లు రైతు వేదికలతో పాటు గ్రామాల్లో ముఖ్య ప్రదేశాలో ప్రదర్శించాలని అన్నారు.

సాగునీటి దినోత్సవం సందర్భంగా గతంలో ఉన్న ఆయకట్టు, ప్రస్తుత పరిస్థితి, అదనపు తూములు, చెరువులు, చెక్ డ్యాంల సంపూర్ణ సమాచారం అందించాలని అన్నారు. సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు కల్గిన లబ్ది వివరాలతో ప్రతి గ్రామంలో పోస్టర్ ఏర్పాటు చేయాలని, గ్రామాల వారిగా లబ్దిదారుల వివరాలు ప్రజాప్రతినిధులకు అందించాలని కోరారు.

పల్లె ప్రగతి లో భాగంగా గ్రామాల్లో మారిన స్వరూపం, పెరిగిన పచ్చదనం, మౌలిక వసతులు తెలియజేస్తు గ్రామాల వారీగా నాడు నేడు పరిస్థితుల ఫోటోలు ప్రదర్శించాలని అన్నారు. ఓడిఎఫ్+ వల్ల తగ్గిన వ్యాధులు వివరాలతో నివేదిక ఉండాలని అన్నారు.

అనంతరం 21 రోజుల పాటు నిర్వహించే దశాబ్ది వేడుకలకు రోజుల వారిగా చేపట్టాల్సిన చర్యలు పై అధికారులతో చర్చించారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీహర్షిని ఎస్పీ సురేందర్ రెడ్డి ఆదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ టిఎస్ దివాకర, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ డీఎఫ్ లావణ్య మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట్రాణి సిద్దు వైస్ చైర్పర్సన్ ఎంపీపీలు జెడ్పిటిసిలు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు..

జిల్లా పోరా సంబంధాల అధికారి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చే జారీచేయనైనది.

Share This Post