* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 01(శుక్రవారం ).
పండుగ వాతావరణంలో బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.
శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గ్రామీణఅభివృద్ధిశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జిల్లాలోని భూపాలపల్లి మున్సిపాలిటీ మరియు 11 మండలాల్లో 277 రేషన్ షాపుల ద్వారా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలలోపు మహిళలకు 1లక్ష 43 వేల 800 బతకమ్మ చీరలను, 61 సంవత్సరాలు పైబడిన మహిళలకు ప్రత్యేకంగా రూపొందించిన 23 వేల చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేయడం జరిగిందని, 4 కోట్ల 63 లక్షల 98 వేల 870 రూపాయల వ్యయంతో 30 డిజైన్లలో రూపొందించిన ఈ బతుకమ్మ చీరలను ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి ప్రారంభించి నియోజక వర్గం వారీగా వారం రోజుల పాటు బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 2వ తేదీ శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉదయం 10.30 గంటలకు స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, మున్సిపల్ చైర్ పర్సన్ షెగ్గెం వెంకటరాణి,స్థానిక ఎంపిపి, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, మహిళలు అందరూ సద్వినియోగం చేసుకునేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా మండల స్థాయిలో మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఐకేపీ ఏపీఎంలు, గ్రామస్థాయిలో గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ అధికారులు, వార్డు సభ్యులు, రేషన్ షాపులు డీలర్లు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు, డ్వాక్రా మహిళలు, అధికారులను సమన్వయం చేసుకొని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్నీ విజయవంతంగా నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్. దివాకర, జిల్లా గ్రామీణఅభివృద్ధి అధికారి పురుషోత్తం, జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారిచేయనైనది.