పందిరి కూరగాయలు సాగుచేసి షెడ్యూల్డ్ కులాల వారు ఆర్థికంగా ఎదగాలి – అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేసిన 136 మంది లబ్ధిదారులు శాశ్వత పందిరి కూరగాయల పెంపకంలో రాణించి ఆర్థికంగా ఎదగాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
శుక్రవారం నాగర్ కర్నూలు పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో ఎస్సీ కార్పొరేషన్ కింద ఎంపిక చేసిన 136 మంది లబ్ధిదారులకు కూరగాయల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రైతుల కోసం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఒక ఎకరానికి 3 లక్షల 50 వేల రూపాయలు పందిరి సాగు కు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
2 లక్షల 10 వేల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1 లక్షల 40 వేల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించనున్నరని తెలిపారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పందిరి కూరగాయల సాగు చేసి ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.
పందిరి సాగు కావలసిన అవగాహనను ఉద్యాన శాఖ అధికారులతో కల్పిస్తామన్నారు.
కాకరకాయలు, పొట్లకాయలకు మార్కెట్లో అధిక లాభాలతొ పాటు మంచి డిమాండు ఉంటుందన్నారు.
సాగుకు కావలసిన మెలకువలను తెలుసుకొని లాభాలు గడించాలని సూచించారు.
పందిరి కూరగాయల సాగు యూనిట్ కు బదులుగా పాడి గేదలు కావాలనుకునే లబ్ధిదారులు ఈ నెల 15వ తేదీలోగా ఈడి ఎస్సి కార్పొరేషన్ కు లిఖితపూర్వకంగా అందజేయాలని లబ్ధిదారులకు సూచించారు.
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ….
ఎస్సీల అభ్యున్నతి కై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తుందని వాటినన్నిటినీ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులు తమ యూనిట్లను సకాలంలో మొదలుపెట్టి, బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించాలని కోరారు.
4 కోట్ల 76 లక్షల రూపాయలను పందిరి కూరగాయల సాగుకు 136 మంది లబ్ధిదారులకు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
పందిరి కూరగాయల సాగు లో నాగర్ కర్నూలు జిల్లా, రాష్ట్ర రాష్ట్రస్థాయి లో ప్రథమ స్థానం గా నిలిచేలా కృషి చేయాలని సూచించారు.
కూరగాయల సాగు, పాడి తో అభివృద్ధి చెందుతూ కుటుంబాల అభివృద్ధికి తోడ్పాటు చేసుకోవాలన్నారు.
జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రామ్ లాల్ మాట్లాడుతూ….
పందిరి కూరగాయల సాగు ఎంపికైన లబ్ధిదారుల గ్రామస్థాయిలో యూనిట్ ప్రారంభించేందుకు ఏజెన్సీలను ఎంపిక చేయడం జరిగిందనన్నారు.
ఏజెన్సీలు విత్తనాల సరఫరా తోపాటు తోటల పెంపకం మెలకువలను అవగాహన కల్పిస్తారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post