పంద్రాగస్టు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

పంద్రాగస్టు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -13:

పంద్రాగస్టు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

శనివారం జిల్లా కలెక్టర్ కె. శశాంక ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి స్థానిక ఎన్.టి.ఆర్. స్టేడియం లో చేస్తున్న పంద్రాగస్టు ఏర్పాట్లను పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 15న రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్.టి.ఆర్. స్టేడియం లో ఉదయం 10-30 గంటలకు జాతీయ పతావిష్కరణ చేయనున్నారు అని, ఈ సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేసి కార్యక్రమానికి విచ్చేసిన వారందరికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, వి. ఐ.పి., స్వాతంత్ర్య సమరయోధులకు గ్యాలరీ, ప్రెస్, అవార్డ్ తీసుకొను వారికి ప్రత్యేకంగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేయాలని, ప్రజలు, విద్యార్థులు కూర్చునే విధంగా సరిపడ సౌకర్యాలు గ్యాలరీలో కల్పించాలని తెలిపారు.

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సౌకర్యార్థం స్టేజ్ కు ఎదురుగా ఫోటోలు, వీడియోలు తీసుకునే విధంగా అనువైన ఏర్పాట్లు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ సందర్భంగా దుమ్ము లేవకుండా, కాళ్ళు కాలకుండ మ్యాట్ వేయాలని, అవసరం మేరకు బారికేడ్లను ఏర్పాటు చేయాలని, పోలీసు గౌరవ వందనం, కవాతు ప్రదర్శన, శకటాల ప్రదర్శన, స్టాల్ ల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇంటింటా ఇన్నివేటర్ కు రెండు స్టాల్ లను ఏర్పాటు చేయాలని, త్రాగునీరు, స్నాక్స్ అందించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఎస్పీ యోగేష్ గౌతం, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో కొమురయ్య, పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ టి.సుధాకర్, ఆర్ అండ్ బి ఈ. ఈ. తానేశ్వర్, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, తహసిల్దార్ నాగభవాని, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post