పకడ్బందీగా ఓటరుజాబితా సిద్ధం చేయాలి:: ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్

జనగామ, సెప్టెంబర్ 18: 2022 ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా పకడ్బందీగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులతో ఓటర్ జాబితా, ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, ఎపిక్ కార్డుల పంపిణీ, స్వీప్ కార్యక్రమాలపై ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 27 నుండి వచ్చే నెల 2 రెండు వరకు ప్రత్యేక కార్యాచరణ చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేయాలన్నారు. నూతన పోలింగ్ కేంద్రాల ఆవశ్యకత ఉన్న చోట గుర్తించాలన్నారు. రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటుచేయాలన్నారు. సూచించిన సమయానుసారం ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ, ఇవియం గోడౌన్ నిర్మాణం పూర్తయినట్లు, అగ్నిమాపక చర్యల గురించి నిధుల కొరకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. ప్రి రివిజన్ చర్యలు చేపట్టామన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 ఓటర్లకు మించకుండా, అవసరమైతే అదనపు పోలింగ్ కేంద్రాల కొరకు 14 అక్టోబర్ కల్లా ప్రతిపాదనలు సమర్పిస్తామన్నారు. మరణించిన వారి పేర్లు జాబితా నుండి తొలగింపు, షిఫ్టెడ్ ఓటర్ల విషయంలో, పేరు, తండ్రి పేరు, అడ్రస్ ఒకే విధంగా ఉన్న పేర్ల విషయంలో ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామన్నారు. ఫారం 6, 6ఏ, 7, 8, 8ఏ దరఖాస్తులు ఆన్లైన్, ఆఫ్ లైన్ లో నమోదయినవి పరిశీలించి, పరిష్కరిస్తామన్నారు. ఎపిక్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. స్వీప్ కార్యక్రామాన్ని చేపడతామన్నారు. స్పెషల్ సమ్మరి రివిజన్ ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. ఓటర్లలో అవగాహన, చైతన్యం కొరకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, ఆర్డీవోలు మధు మోహన్, కృష్ణవేణి, ఎస్డీసి మాలతి, జిల్లా ఉద్యానవన అధికారిణి కేఆర్. లత, కలెక్టరేట్ పర్యవేక్షకులు ఏతేషామ్ అలీ, ఎలక్షన్ డిటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post