పకడ్బందీగా దళిత బంధు యూనిట్లను గ్రౌండింగ్ చేయాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

పకడ్బందీగా దళిత బంధు యూనిట్లను గ్రౌండింగ్ చేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

000000

     దళిత బంధు యూనిట్లను పగడ్బందీగా గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.

     సోమవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో హుజూరాబాద్, మానకొండుర్, చోప్పదండి మరియు కరీంనగర్ నియోజకవర్గాల క్లస్టర్, గ్రౌండింగ్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లతో క్లస్టర్ వారిగా జిల్లా కలెక్టర్  సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతు జిల్లాలో ఇంకాపూర్తిగా రాని యూనిట్లు కోటేషన్లు, బ్యాడ్జి లైసెన్స్ లేక ఇతర దృవపత్రాలు సరిగా లేని యూనిట్లు, మంజూరు కానీ వాటి వివరాలను  ఎంపిడిఓ, మున్సిపల్ కమీషనర్లను, క్లస్టర్ అధికారులు సేకరించాలని, దళితులు వారికి నచ్చిన యూనిట్లు ఎంచుకుని ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రోత్సహించాలని, ఇతర (సెంట్రింగ్, టెంట్ హౌజ్, మెడికల్ జనరల్ స్టోర్లు, సూపర్ మార్కెట్, హర్డ్ వేర్ మ్యానిఫ్యాక్చర్, మిని సూపర్ మార్కెట్లు, ఫోటో షూట్లు, మిని డైరి) యూనిట్ లను లబ్దిదారులు పెట్టుకునే విధంగా ప్రోత్రహించాలని, గ్రౌండింగ్ అయిన లబ్దిదారుల యూనిట్ల వినియోగానికి సంబంధించి క్లస్టర్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి ఫోటోలను పంపించాలని అన్నారు. జిల్లాలో నూతనంగా విడతల వారిగా 172 యూనిట్ల విడుదలకు క్లస్టర్ అధికారులు, యంపిడిఓలు, మున్సిపల్ కమీషనర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.  మోటారు వాహనాలపై క్లస్టర్ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.

     ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జట్పిసిఈఓ ప్రియాంక, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చంద్ర శేఖర్ గౌడ్, జిల్లా నెహ్రూ యువ కేంద్ర కో ఆర్డినేటర్ రాంబాబు, క్లస్టర్ అధికారులు, ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post