పకడ్బందీగా దశాబ్ది వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలి….. శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి. భాను ప్రసాద్ రావు

పకడ్బందీగా దశాబ్ది వేడుకలను  పండుగ వాతావరణంలో నిర్వహించాలి….. శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి. భాను ప్రసాద్ రావు

ప్రచురణార్థం

*పకడ్బందీగా దశాబ్ది వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలి….. శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి. భాను ప్రసాద్ రావు*

**ప్రతి శాఖ పరిధిలో నాడు- నేడు పరిస్థితులను వివరించాలి*

**దశాబ్ది వేడుకల ఏర్పాట్లకు ప్రజా ప్రతినిధుల నుంచి సంపూర్ణ అవగాహన*

**వేడుకలలో పాల్గోనే ప్రజలకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు*

**తెలంగాణ విజయాలను నలుదిక్కులా ఘనంగా చాటాలి*

**రాష్ట్ర దశాబ్ది వేడుకలు నిర్వహణపై రివ్యూ నిర్వహించిన శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్*
————————–
పెద్దపల్లి, మే -31:
————————–
జిల్లాలో రాష్ట్ర దశాబ్ది వేడుకలను పకడ్బందీగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి.భాను ప్రసాద్ రావు అన్నారు.

బుధవారం సాయంత్రం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ భాను ప్రసాద్ రావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యే లు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్ లతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల పై రివ్యూ సమావేశం నిర్వహించారు.

*ఈ సందర్భంగా శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడుతూ,* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మారిన పరిస్థితులను స్పష్టంగా వివరించాలని అన్నారు.

జూన్ 2 నుంచి జూన్ 22 వరకు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు పకడ్బందీగా చేయాలని, వేడుకలలో పాల్గోనే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతంగా వేడుకలు నిర్వహించాలని అన్నారు.

ప్రతి శాఖ నుంచి గ్రామాల వారీగా, మండలాల వారీగా చేసిన అభివృద్ధి పనులను, ప్రజలకు అందించిన వివిధ సంక్షేమ పథకాలు, దాని వల్ల కల్గిన లబ్ది సంపూర్ణంగా వివరించాలని, ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా గ్రామాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. దశాబ్ది వేడుకలలో నిర్వహించే ప్రతి కార్యక్రమం ఏర్పాట్లు పై ముందస్తుగా ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని, నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు ముందుండాలని తెలిపారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్, త్రాగునీటి సౌకర్యం, సాగు నీరు, రోడ్లు, సంక్షేమం ఇలా ప్రతి రంగంలో అద్బుత విజయాలు సాధించామని, వాటిని గణాంకాలతో సహా ప్రజలకు తెలియ జేయాలని, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెరిగిందని, ప్రైవెట్ విద్యాసంస్థలకుధీటుగా గురుకులాల్లో అద్భుతమైన ఫలితాలు విద్యార్థులు సాధించారని అన్నారు. గ్రామీణాభివృద్ధి, మున్సిపాలిటీలలో అద్భుతమైన ప్రగతి సాధించామని, గ్రామీణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో తెలంగాణ రాష్ట్రం అధిక సంఖ్యలో అవార్డులు వచ్చాయని తెలిపారు.

దశాబ్ది వేడుకల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని, ప్రతి శాఖలో వారిగా సాధించిన ప్రగతి వివరాలు తెలియ జేయాలని అన్నారు. సాగునీటి రంగంలో జిల్లాలో జరిగిన పురోగతి వివరించాలని తెలిపారు.

*జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ మాట్లాడుతూ,* దశాబ్ది వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం ప్రజాప్రతినిధుల తరపున అందిస్తామని, ప్రతి కార్యక్రమ నిర్వహణ సమయంలో చేసే ఏర్పాట్ల పై ముందస్తుగా సమాచారం అందించాలని, ప్రజలకు ఎలాంటి చిన్న అసౌకర్యం కలగకుండా అదనపు సౌకర్యాల కల్పనకు సహకరిస్తామని అన్నారు.

*జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,* ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కట్టుదిట్టంగా వేడుకలు నిర్వహిస్తమని కలెక్టర్ తెలిపారు.
ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాల క్రింద లబ్ది చేకూరిన లబ్దిదారుల వివరాలు గ్రామాల వారిగా నివేదిక తయారు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

సంక్షేమ సంబురాలు సందర్బంగా గొర్రెల పంపిణీ రెండవ విడత, అవకాశం ఉన్న చోట భూ పట్టాల పంపిణీ ప్రారంభిస్తామని అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రతి కార్యక్రమం తప్పనిసరిగా లోకల్ సిటి కేబుల్ లో ప్రసారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ , జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జిల్లా అధికారుల, మునిసిపల్ కమిషనర్ లు, తహసిల్దార్ లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

Share This Post