పకడ్బందీగా 10వ తరగతి పరీక్షల నిర్వహణ చేపట్టాలి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

పకడ్బందీగా 10వ తరగతి పరీక్షల నిర్వహణ చేపట్టాలి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

ప్రచురణార్థం

**పరీక్షల దృష్ట్యా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి*

**పోలీస్ బందోబస్తుతో ప్రశ్నపత్రాల తరలింపు*

*విద్యార్థులు మానసిక ఒత్తిడి గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాసే దిశగా చర్యలు*

మహబూబాబాద్ మార్చి 29:

10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు

బుధవారం ఐ డి ఓ సి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో హైదరాబాదు నుండి పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు శ్రీ దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షలను అధికారులు విజయవంతంగా నిర్వహించి నందుకు అభినందిస్తూ ఏప్రిల్ 3 నుంచి13 వ తేదీ వరకు జరుగు పదవ తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

10వ తరగతి పరీక్షలో గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 6 పేపర్లుగా కుదించామని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు.

పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు.

విద్యార్థులు హాల్ టికెట్ లను వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని, త్రాగునీరు ఏర్పాట్లు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

పరీక్షా కేంద్రాలలో సెల్ ఫోన్ నిషేధించడం జరిగిందన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అధికారులు ఆత్మస్థైర్యం కల్పించాలన్నారు.

గతంలో ఉన్న 11 పరీక్షలను ప్రస్తుతం 6 పరీక్షలకు కుదించామని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ …

జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ విషయంలో ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నెంబర్లు 9849761012 కు గాని 7995087625 కాల్ చేయాలని ప్రచారం చేపట్టామన్నారు

ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించా మన్నారు

పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు డ్యూయల్ డెస్క్లు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తున్నామన్నారు

తెలుగు హిందీ మ్యాథ్స్ సోషల్ సబ్జెక్టులకు 30 నిమిషముల ముందుగా ఆబ్జెక్టివ్ ఇవ్వబడుతుందని,

ఇంగ్లీష్ పేపర్ కు మాత్రం పేపర్ తోనే ఆబ్జెక్ట్ ఇవ్వబడుతుందని,

ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ పేపర్లకు ఆబ్జెక్టివ్లు 15 నిమిషాల ముందుగా ఇవ్వబడుతుందని ఇట్టి మార్పులు విద్యార్థులు తెలుసుకునేలా పత్రికల ద్వారా తెలియజేశామన్నారు .

పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ విద్యాశాఖ అధికారి రామారావు, జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఉమా గౌరీ , ఏ ఎస్ పి చెన్నయ్య , పోస్టల్ పర్యవేక్షకులు రామచందర్, ఆర్టిఏ అధికారి రమేష్ రాథోడ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post