పకడ్బందీ కార్యాచరణతో 100 శాతం కోవిద్ వాక్సినేషన్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పి.హెచ్.సి. మెడికల్ ఆఫీసర్లకు సూచించారు.

మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ మోటకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా
సందర్శించారు.  మెయిన్ స్టోర్ రూమ్, వార్డుల ను, లేబర్ రూమ్,  ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.  అనంతరం వ్యాక్సినేషన్ పై  పి హెచ్ సి డాక్టర్ రాజేందర్ ను  వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మండలంలో 18 సంవత్సరాలు పైబడిన వారు 15,268 మంది ఉన్నారని,  వీరిలో 13 వేల 400 మందికి 90% వ్యాక్సిన్ వేయడం జరిగిందని డాక్టర్ రాజేందర్ తెలిపారు.  12,329 మంది మొదటి డోస్‌, 6415 మంది రెండవ డోస్  తీసుకున్నారని  వివరించారు.
వంద శాతం వాక్సినేషన్ కావాలని,  మిగిలిన 867 మందికి కూడా ప్లాన్ చేసుకొని వాక్సిన్ అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో హెచ్ ఇ వో ప్రవీణ్,  వైద్య సిబ్బంది ఉన్నారు.

Share This Post