పక్క రాష్ట్రం నుండి వరి ధాన్యం రాకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలి జిల్లా అదనపు కలెక్టర్ పద్మజా రాణి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి 1960 మద్దతు ధరతో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నందున బయటి నుండి జిల్లాలో ధాన్యం రాకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని చెక్ పోస్ట్ అధికారులను ఆదేశించారు. ఆదివారం అదనపు కలెక్టర్ పద్మజారాణి జిల్లా లో సుడిగాలి పర్యటన చేశారు. కర్ణాటక నుంచి ధాన్యం రాకుండా అరికటెందుకు తీసుకున్న జగ్రతలను స్వయంగా పరిశించారు. కృష్ణ మండలంలోని కృష్ణ బ్రిడ్జ్ పై ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్, ఉజ్జలి చెక్ పోస్ట్, చేగుంట మరియు నారాయణపేట మండలం జలలపూర్, సమస్తపూర్ మరియు దామరగిద్ద మండల కాన్ కుర్తి తెలంగాణా కర్ణాటక బోర్డర్ లో మార్కెటింగ్, సివిల్ సైప్లై మరియు పోలిస్ అధికారుల ద్వార ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ లను పరిశీలించి కర్ణాటక లో పండించిన వరి ధాన్యాన్ని తెలంగాణను రాకుండగా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా లో 6 బోర్డర్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని కర్ణాటక నుంచి రాకుండా చెక్ పోస్టుల పటిష్ట బద్రత ఏర్పాటు చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ కు అధికారులు తెలిపారు. పోలీస్ అధికారులు జిల్లా వ్యవసాయ మరియు సివిల్ సప్లై అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు సమనవేయం తో పని చేసి జిల్లా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారి దగ్గర ఖాతా నెంబర్ మరియు పాస్ బుక్ లను పరిశీలించి వారి ఖాతా లో డబ్బులను జమ చేయాలని ఆదేశించారు. వచ్చే వాహనలను క్షునంగ పరిశీలించాలని వాహన వివరాలను నమోదు చేసుకోవాలని అలాగే నఖిలి వితనలను అరికట్టుగా కూడా ఈ చెక్పోస్ట్ లను ఉపయోగపడుతుందన్నారు. రైతులు ఎలాంటి ఇబందులు పడనవసరం లేదని జిల్లా లో ఉన్నరైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జిల్లా లో 91 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని రైతులు అమడానికి విలు అఎవిన్దంగా ఉన్నాయని రైతులకు సూచించారు. జిల్లా లో నకిలీ వితనలు ఆమ్మే వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో నకిలీ విత్తనాలు రాకుండా చూడాలన్నారు. జిల్లా లో నకిలీ వితనల నివారణకు పోలిస్ అధికారులు వ్యవసాయ అధికారులు కలిసి ఓ టాస్క్ ఫోస్ర్ ను ఏర్పాటుచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా పౌరసరఫరా అధికారి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, ఏవో లు ఎయిఓ లు రివ్యూన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.