పగిడిద్దరాజు దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తాం…

పగిడిద్దరాజు దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తాం…

ప్రచురణార్థం

పగిడిద్దరాజు దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తాం…
గంగారం
మహబూబాబాద్ జనవరి 10.

పగిడిద్దరాజు దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు.

సోమవారం గంగారం మండలంలోని పూను గుండ్ల గ్రామాన్ని జడ్పీ చైర్మన్ ఆంగోతు బిందు జిల్లా కలెక్టర్ శశాంక ములుగు శాసనసభ్యులు దనసరి అనసూయ (సీతక్క) లతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించి పగిడిద్దరాజు దేవాలయాన్ని సందర్శించి వనదేవత పగిడిద్దరాజును దర్శించుకున్నారు.

ఆలయ సాంప్రదాయ ప్రకారం అతిథులను పూజారులు గ్రామస్తులు సత్కరించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిరంతరంగా కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా మేడారం జాతర పురస్కరించుకొని సమ్మక్క సారలమ్మ జాతరలు 2016, 2018, 2020 లలో 350 కోట్ల నిధులను వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వివరించారు.

మేడారం జాతర సందర్భంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు గాను జంపన్నవాగులో చెక్ డ్యామ్ ల నిర్మాణం రహదారుల అభివృద్ధి మరుగుదొడ్లు త్రాగు నీటి సౌకర్యాలు వైద్య సౌకర్యాలు భక్తులకు షెడ్స్, నిర్మాణాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లు కేటాయించిందని అదేవిధంగా భక్తులు చిన్న జాతరలు కూడా నిర్వహించుకుంటూ ఉన్నందున గిరిజన ప్రాంతాలలోని ఆలయాల ను అభివృద్ధి పరచాలని సంకల్పంతో అభివృద్ధి పనుల కొరకు రూ ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు కేటాయించామన్నారు .

అందులో భాగంగా గుంజేడు ముసలమ్మ దేవాలయ అభివృద్ధి పనులకు 24 లక్షలు, పూనుగొండ్ల గ్రామంలోని వన దేవత అయిన పగిడిద్దరాజు దేవాలయ అభివృద్ధి పనులకు 32 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు అలాగే పస్రా నుండి మేడారం వరకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభావిత ఏడు గ్రామాలలో కూడా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. త్రాగునీటి సౌకర్యం కొరకు మరో మూడు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టామన్నారు.

విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపాలని 250 కోట్లతో విద్యుత్ లేని గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు రహదారుల అభివృద్ధికి సిగ్నల్ సమస్యలకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఈసం రమ ఎంపీటీసీ సువర్ణ పాక సరోజ సర్పంచ్ లక్ష్మి గిరిజన అభివృద్ధి అధికారి దిలీప్ కుమార్ ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ హేమలత డి ఈ మధుకర్ గంగారం కొత్తగూడ తాసిల్దార్ లు సూర్యనారాయణ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
——————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post