ప్రచురణార్థం
ఖమ్మం ఆగష్టు 25, 2021
పచ్చదనాన్ని పెంపొందించి ప్రజలకు అహ్లాదకర, కాలుష్య రహిత వాతావరణాన్ని అందించే పల్లె ప్రకృతి వనాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రఘనాథపాలెం మండలం కేంద్రంలో బృహత్ పల్లె ప్రకృతి వనం. కోసం గుర్తించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ వి.పి. గౌతమ్ తో కలసి బుధవారం మంత్రి పరిశీలించారు. 10 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటుచేయనున్నబృహత్ పల్లె ప్రకృతి వనంలో పచ్చదనాన్ని విరివిగా పెంచేందుకు ప్రజలకు ఉపయోగపడే జామ, దానిమ్మ, ఉసిరి, సీతాఫలం, నేరేడు, పారిజాతం, కరివేప తదితర మొక్కలతోపాటు వివిధ రకాల పూలమొక్కలు బృహత్ పల్లె ప్రకృతి వనంలో నాటి సంరక్షించాలని మంత్రి ఆదేశించారు. దీనితోపాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకుగాను వాకింగ్ ట్రాక్, ఓపెన్ జీమ్ చిన్నపిల్లల అటవిడుపు పరికరాలు ఏర్పాటుచేయాలని, ప్రకృతి వనం చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయాలని వీటికి సంబందించిన పనులను సత్వరమే ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రక్కనే గల చెరువును మినిట్యాంక్ బండ్ అభివృద్ధి పనులకు తగుచర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మదుసుదన్, నగరపాలకసంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి డి. లక్ష్మి ప్రసన్న, జడ్పిటిసి మాలోతు ప్రియాంక, తహశీల్దారు నరసింహరావు, మండల అభివృద్ధి అధికారి రామకృష్ణ, సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం వారిచే జారీచేయనైనది.