పటిష్టమైన శాంతిభద్రతల తోనే అభివృద్ధి సాధ్యం:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం-1 తేదీ.21.10.2021
పటిష్టమైన శాంతిభద్రతల తోనే అభివృద్ధి సాధ్యం:: జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల అక్టోబర్ 21:- శాంతి భద్రతలు పటిష్టంగా అమలుతోనే ప్రాంతాలు అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జి.రవి తెలిపారు. గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని జగిత్యాల లోని పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు కలెక్టర్ నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన 7 సంవత్సరాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి భద్రతల పకడ్బందీగా పోలీస్ శాఖ పర్యవేక్షిస్తుందని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందించే దిశగా పోలీసు శాఖ చేసిన కృషి అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు జాతీయ ఐక్యత కోసం ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇది అభినందనీయమని కలెక్టర్ అన్నారు.
దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీస్ దేశానికి ఆదర్శంగా తెలంగాణ పోలీస్ విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే సమాజం అభివృద్ధి పదంలో నడుస్తుంది అనడానికి తెలంగాణ రాష్ట్రమే ఉదాహరణ అని ఎస్పీ అన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, అభివృద్ధి, భౌతిక భద్రత నుంచి సామాజిక రుగ్మతల నిర్మూలన, కరుణ వంటి విపత్కర సమయంలో సైతం పోలీసులు ముందుండి విధులు నిర్వహించారని తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకునేందుకు దేశవ్యాప్తంగా అక్టోబర్ 21 న పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించు కుంటామని, అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 21 వరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సంస్మరణ సభ్యులు నిర్వహించామని తెలిపారు. వీటిలో భాగంగా సమాజ నిర్మాణంలో పోలీసుల పాత్ర వంటి అంశంపై ఆన్ లైన్ లో వ్యాసరచన పోటీలు, షార్ట్ ఫిలిం ,ఫోటోగ్రఫీ పోటీ, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు అక్టోబర్ 21 నుంచి 31 వరకు జాతీయ ఐక్యత కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పోలీసు వ్యవస్థలో సాంకేతికత వినియోగం, ప్రజలకు చేరువ లో ఉండే విధంగా తీసుకునే చర్యలు, ఫ్రెండ్లీ పోలీస్ తదితర అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత సంవత్సరం కాలంలో దేశవ్యాప్తంగా 377 మంది పోలీసులు వీధులలో అమరులయ్యారని , ఇందులో సిఆర్పిఎఫ్, ఐటిబిపి, బిఎస్ఎఫ్ , పోలీసులు ఉన్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా పరిధిలో 1985 నుంచి ఇప్పటి వరకు మరణించిన పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు.

పటిష్టమైన శాంతిభద్రతల తోనే అభివృద్ధి సాధ్యం:: జిల్లా కలెక్టర్ జి.రవి

ఈ కార్యక్రమంలో జిల్లా అడ్మిన్ ఎస్పీ సురేష్, పోలీస్ అమర వీరుల కుటుంబ సభ్యులు, పొలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది

Share This Post