పటిష్ట కార్యాచరణ తో సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 16: పటిష్ట కార్యాచరణతో సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. గురువారం పాలకుర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం నుండి జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమ ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పక్కా ప్రణాళిక ప్రకారం వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమానికి సంబంధించి నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వారీగా వైద్యాధికారులు, ప్రత్యేక అధికారులు, ఎంపిడివో ల పేర్లు, మొబైల్ నెంబర్లు, , సబ్ సెంటర్ల పేరు, ఆవాసాల పేరు, అక్కడి ఇండ్ల సంఖ్య నమోదు చేయాలన్నారు. ఒక రోజు ఒక ఆవాసంలో ప్రక్రియ చేపట్టి, రెండో రోజు మరోచోట, అన్ని అవాసాల్లో ప్రక్రియ మొదలయిన తర్వాత, తిరిగి మొదటి ఆవాసంలో మిగులు వారికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా కార్యాచరణ చేయాలన్నారు. ఆవాసాల వారీగా వ్యాక్సిన్ ఇవ్వాలని, వీలయినన్ని ఎక్కువ ఆవాసాలను కవర్ చేయాలని కలెక్టర్ తెలిపారు. 15 రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకే వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించాలని, ఎంపిడివోలు కేంద్రాల వద్ద కనీస మౌళిక సదుపాయాల కల్పన, ఏర్పాట్లు చేయాలని అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి వరకు ఎటువంటి సెలవులు లేవని, ప్రతిరోజూ ఇవ్వాల్సిందేనని ఆయన తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం ప్రక్రియ పై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆయన అన్నారు. రోజువారీ నివేదికలో ఎన్ని ఆవాసాలు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది, ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చింది తెలుపాలన్నారు. అన్ని అవాసాల్లో మనమే వెళ్లి, వ్యాక్సిన్ ఇవ్వాలని, వారిని రమ్మనడం చేయకూడదని ఆయన అన్నారు. సర్వే కు ఎన్ని టీములు, ఎందరి ఇండ్లకు వెళ్ళింది ప్రతిరోజూ నివేదిక సమర్పించాలన్నారు. సర్వే, వ్యాక్సినేషన్ పురోగతిపై వాట్సాప్ లో పోస్ట్ చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని, లక్ష్యం సాధించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్ వున్నారు
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post