పట్టణంలోని నర్సింగ్ కళాశాల, నర్సింగాయ పల్లిలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన,     తేది:21.01.2022, వనపర్తి.

నర్సింగ్ కళాశాల, మాత, శిశు ఆరోగ్య కేంద్రం పనులను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
శుక్రవారం వనపర్తి పట్టణంలోని నర్సింగ్ కళాశాల, నర్సింగాయ పల్లిలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మాణ పనులలో ఎలాంటి జాప్యం లేకుండా సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు ఆమె సూచించారు. నిర్ధారించిన గడువు లోపల పెండింగ్ పనులు పూర్తిచేసి, నర్సింగ్ కళాశాలను త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆమె తెలిపారు.  మాతా, శిశు సంరక్షణ కేంద్రం పనులను పూర్తి చేయుటకు జాప్యం అవుతున్నందున అధికారులను ఆమె మందలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రోగ్రామింగ్ అధికారి రవిశంకర్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, రామానుజన్, వైద్య సిబ్బంది, కాంట్రాక్టర్లు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
…………..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post