పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

తొర్రూరు,
మహబూబాబాద్ జిల్లా, జూన్ -06:

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ తొర్రూర్ మండలం లో పర్యటించారు.

తొర్రూరు 10, 11వ వార్డ్ లో హరిపిరాల రోడ్డులో వైకుంఠ ధామం వద్ద రోడ్డు ప్రక్కన చెత్త వేసి ఉండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక వెంటనే శుభ్రం చేయాలని, పట్టణ ప్రాంతం పరిశుభ్రంగా ఉండే విధంగా పారిశుధ్య పనులు నిర్వహించి క్లీన్ గా ఉండే విధంగా చూడాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిపై ప్రజలకు అవగాహన కల్పించి చెత్త వేయకుండా చూడాలని, ప్రవర్తనలో మార్పు రాని సందర్భంలో జరిమానాలు విధించాలని తెలిపారు. అనంతరం వైకుంఠ ధామం లోకి వెళ్లి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వార్డ్ కౌన్సిలర్ లు, డి ఆర్ డి ఓ సన్యాసయ్య, ఆర్డీవో రమేష్, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, తహసిల్దార్ రాఘవరెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post