పత్రికా ప్రకటన తేదిః 05-07-2021
పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి :: రాష్ట్ర సంక్షేమశాఖ మాత్యులు కోప్పుల ఈశ్వర్
జగిత్యాల, జూలై 05: ధర్మపురి పట్టణాన్ని సుందరంగా అభివృద్ది చేసి హరిత పట్టణంగా మార్చాలని రాష్ట్ర సంక్షేమ శాఖా మాత్యులు కోప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం ధర్మపురి పట్టణంలో చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించి అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా, ధర్మపురి దేవాలయ ప్రాంగణం నుండి గోదావరి నది హనుమాన్ గట్టు వద్ద హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. గతంలో నాటిన మొక్కల ఎదుగుదలను పర్యవేక్షించి ఇంకనూ అక్కడ అక్కడ ఖాళీ ప్రదేశాలు లేకుండా పిచ్చి మొక్కలను తొలగించి విరివిగా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులను మున్సిపల్ కమిషనర్ ను మరియు ప్రజాప్రతినిధులకు ఆదేశించారు. గోదావరినది స్నానఘట్టాల వద్ద అపరిశుభ్రత గమనించి ప్రతి 15 రోజులకు ఒకసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఎక్కువ మంది కార్మికులతో ఎప్పటికప్పుడు శుభ్రంగా చేయాలని, విధులు నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతనంగా నిర్మించబడిన స్మశాన వాటిక ను సందర్శించి ఇంకనూ అవసరమగు తగు ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించాలని తెలియజేశారు. స్మశాన వాటిక ప్రాంగణము నందు మొక్కలు నాటి చెట్లకు నీరు అందించారు. అనంతరం ధర్మపురి పట్టణంలోని పలు వార్డులలో, ఎస్సీ కాలనీలో పర్యటించి ప్రజల నుండి సమస్యల వివరాలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పట్టణ అభివృద్ధి మరియు సమస్యల పై సంబంధిత మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులు, కౌన్సిలర్లు తో రివ్యూ సమావేశం నిర్వహించారు. పట్టణ అభివృద్దికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక నిధులను సమకూర్చుతున్నారని పేర్కోన్నారు. పట్టణంలో మిషన్ భగీరథ పైప్ లైన్ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తెలుపుతూ వాటి పరిష్కారానికి స్థానిక కౌన్సిలర్లు దగ్గరవుండి పనులు పూర్తి చేయించాలని సూచించారు. పట్టణంలోని మురికి కాలువలు క్లీన్ గా ఉండేలా, పారిశుద్ధ్యం పై ఎక్కువ శ్రద్ధ వహించాలని తెలిపారు.లాక్ డౌన్ ముగిసిపోవడంతో ప్రజలు దేవాలయానికి, నదిస్నానాలకు వస్తున్నారు కాబట్టి ప్రతిరోజు సానిటేషన్ కార్యక్రమాలను చేపట్టాలని, టెంపుల్ సిటిపై అధికారులు ప్రత్యేక దృష్టిని సారించి పనులు చేయాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ, కోన్ని అంశాలలో మంచి పురోగతిని సాధించినప్పటికి, కొన్ని విషయాలలో మాత్రం వెనకబడి పోయారని అన్నారు. క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ లోపం, మున్సిపల్ కమీషనర్ల బదీలీల వలన కూడా కొంత అలసత్వం వహించినట్లు గుర్తించడం జరుగుతుందని అన్నారు. సమస్యలను గుర్తించి వాటిని మీ స్థాయిలోనే పరిశీలించు కోగలుగుతారని అన్నారు. ప్రతిరోజు ఉదయం వార్డులలో మున్సిపల్ కమీషనర్ నుండి క్రింది స్థాయి వరకు పర్యటించి సమస్యలను పరిష్కరించు కోగలుగుతారని అన్నారు. 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో గత 5 రోజుల నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు పనలు చేయడంలో అలసత్వం చూపిస్తూ కార్యక్రమాన్ని నీరుగారుస్తున్నారని, ఇకనైన పద్దతిమార్చుకొని అస్థవ్యస్తంగా ఉన్న పట్టణాన రూపును మార్చాలని, అందమైన టెంపుల్ సిటిగా మార్చాలని, ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సతమ్మ, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ , మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు ,కౌన్సిలర్లు అధికారులు ,సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయననది.