ప్రచురణార్థం
పట్టణాలలో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి……
మహబూబాబాద్, మే -07:
శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. శశాంక ప్రజారోగ్యం పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మునిసిపల్ ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్, సింథటిక్ ట్రాక్, ఇండోర్ ఆటలు ఆడటానికి ఏర్పాట్లకు ప్రతిపాదనలు తయారు చేయాలని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు, రోడ్డు అభివృద్ధిలో భాగంగా వెడల్పు చేసిన పక్షంలో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు ఎంత మేరకు నష్టం వాటిల్లుతుంది అనే విషయాలపై నివేదికలు తయారు చేయాలని సూచించారు. మెయిన్ రోడ్, పార్క్ లు, ఇండోర్ స్టేడియం, మీని టాంక్ బండ్ అభివృద్ధి, డంపింగ్ యార్డ్ ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రజలు కొంత సమయం కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండి రావడానికి అనువుగా పార్కు లను, ప్రాంతాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. క్రొత్త డంపింగ్ యార్డుకు అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టాలని, పారిశుద్ధ్యం పనుల నిమిత్తం అవసరమైన పరికరాలను కొనుగోలు చేయాలని తెలిపారు.
ఈ సందర్భంగా మునిసిపాలిటీ వారీగా టి.యు.ఎఫ్. ఐ.డి.సి. నిధుల నుండి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ లు, పి.హెచ్. ఈ. ఈ., డి.ఈ., ఏ. ఈ లు, పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్ లు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.