పట్టణాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టిందని, ప్రతి పట్టణంలో అన్ని సదుపాయాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

పత్రికా ప్రకటన                                                                తేది: 03-09 – 20 21

        పట్టణాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టిందని, ప్రతి పట్టణంలో అన్ని సదుపాయాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

శుక్రవారం జిల్లాలోని గద్వాల, అలంపూర్, వడ్డేపల్లి,అయిజ పురపాలక సంఘ కమిషనర్లతో పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో రోడ్లు, పార్కులు, మరుగుదొడ్లు, సెగ్రిగేషన్ షెడ్ లు, వైకుంఠ దామాల అభివృద్ధి ఏ మేరకు పూర్తయ్యాయని కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. గద్వాల పురపాలక పరిధిలో 37 వార్డులు ఉన్నాయని కలెక్టర్ కు  కమిషనర్ తెలిపారు. వాటిలో 33 వార్డులలో పనులు జరుగుతున్నాయని, పది వార్డులలో ప్రకృతి వనాలు పూర్తి అయ్యాయని తెలిపారు. అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలో వైకుంఠధామం  పనులకు టెండర్లు అయిందని పనులు త్వరలో మొదలు పెడతామని కలెక్టర్ గారికి  తెలిపారు. గద్వాల పట్టణంలో మరుగుదొడ్లు ఎక్కడ ఎక్కడ నిర్మించారని వాటి నిర్వహణ బాధ్యత పై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మిగతా మున్సిపాలిటీల పరిధిలో కూడా మరుగుదొడ్లు ప్రైవేటు వ్యక్తుల నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రకృతి వనాలలో మొక్కలు నాటే లా చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్ల మధ్యలో ప్లాంటేషన్ సక్రమంగా నిర్వహించి ప్రతి రోజు రెండు సార్లు మొక్కలకు నీరు పెట్టాలని ఆదేశించారు. పట్టణ ప్రగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికలు పంపాలని ఆదేశించారు. వార్డ్ కౌన్సిలర్ లను ఇన్వాల్వ్ చేయాలి, ప్రతి ఇంటిని చెక్ చేయాలి ఇంటి పరిసరాలు శుబ్రంగా ఉంచుకునేలా చూడాలని. సిబందికి ఓవర్ కోట్ ,గ్లౌసులు రెండు  జతలు ఇవ్వాలని , ప్రతి వార్డ్ ను , ప్రతి ఇంటిని జవాన్లు చెక్ చేసేలా చూడాలని, వర్షా కాలం డెంగ్యు, మలేరియ జ్వరాలు రాకుండా  ముందస్తు చర్యలు చేపట్టా లని కమీషనర్ లకు ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష ,  కమీషనర్లు, శ్రీనివాస్ రెడ్డి, నర్సయ్య, పల్లా రావు, నిత్యానంద్  తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————–

 జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల  గారి చేజారి చేయబడినది.

Share This Post