పట్టణాల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వెళ్లి పంచనామా నిర్వహించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం టిఎస్ బి పాస్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎక్కడైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే ఎన్ఫోర్స్మెంట్ బృందం అక్కడికి వెళ్లి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే వెంటనే నోటీసులు అందజేసి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీల వారీగా పెండింగ్ లేఅవుట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్లు దేవేందర్, రమేష్ కుమార్, జగ్జీవన్, అధికారులు పాల్గొన్నారు. —————– జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారి చేయనైనది.

Share This Post