*పట్టణ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*పట్టణ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ప్రచురణార్థం-2*
రాజన్న సిరిసిల్ల, జనవరి 06: పట్టణ అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అధికారులతో పట్టణ అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేములవాడ పట్టణంలో సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం అప్పగించినట్లు, స్థలంలో ఉన్న రెండు పాత ఆర్సీసి స్లాబ్ భవనాలు, మూడు జిఐ మెటల్ షీట్ల ఓపెన్ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ ముగింపు దశలో ఉన్నదన్నారు. శ్యామకుంటలో చేపడుతున్న వెజ్ మార్కెట్ నిర్మాణంలో ఫుటింగ్ పనులు పూర్తయి, కాలంలు గ్రౌండ్ స్థాయికి పోయిర్తయినట్లు గ్రావెల్ ఫిల్లింగ్ జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. వైకుంఠదామం కాంపౌండ్ వాల్, పూజ, వుడ్ స్టోరేజ్ గదులు ప్రగతిలో ఉన్నట్లు, పాత్ వే, పచ్చదనం అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. మిషన్ భగీరథ కు సంబంధించి 113 కిమీ. పైప్ లైన్ పూర్తయినట్లు, గృహాలకు సర్వీస్ కనెక్షన్లు పూర్తిచేసినట్లు, ట్రయిల్ రన్, కమీషనింగ్ పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. డంపింగ్ యార్డ్ కు సంబంధించి, కాంపోస్టు షెడ్, వర్మీ కాంపోస్టు షెడ్, పనులు టైబీమ్ స్థాయికి పూర్తయినట్లు, రూఫింగ్ పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రస్ట్రక్చర్ అభివృద్ధి సంస్థ ద్వారా చేపట్టే అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. పనుల పురోగతిపై రోజువారి పర్యవేక్షణ చేయాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.సిరిసిల్ల పట్టణంలో చేపడుతున్న మినీ స్టేడియం పనుల్లో వేగం పెంచాలన్నారు. పట్టణ పరిధిలో చేపడుతున్న రెండు పడక గదుల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. బై పాస్ రోడ్ పనులు పూర్తి చేయాలన్నారు. నర్సరీల్లో లక్ష్యం మేరకు మొక్కల పెంపకం చేయాలన్నారు. పట్టణ పరిధిలో ఆవెన్యూ ప్లాంటేషన్ కి కావాల్సిన మొక్కలను నర్సరీల్లో పెంచాలన్నారు. లైన్ శాఖల సమస్యలుంటే దృష్టికి తేవాలని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో వేములవాడ మున్సిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు, టౌన్ ప్లానింగ్ అధికారులు అన్సార్, అంజయ్య, పబ్లిక్ హెల్త్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post