పట్టణ ప్రకృతి వనాలు,నర్సరీలను ఆకస్మిక తనిఖీచేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య.


జనగామ,జనవరి 04:
పట్టణంలో విధ్యానగర్, అంబేడ్కర్ నగర్ లలో, పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలను మంగళవారం జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య ఆకస్మిక తనిఖీ చేశారు

ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ
జనగామ పట్టణంలో ఉన్న విద్యా నగర్,అంబేడ్కర్ నగర్ లలో పట్టన ప్రకృతి వనాలు నిర్వహణ సరిగా లేనందున మున్సపాల్ సిబ్బంది పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు పది రోజుల్లొ పూర్తి స్ధాయిలో పనులు పూర్తి చేసి త్వరితగతిన అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

తడి చెత్త- పొడి చెత్త సేకరణకు మునిసిపల్ సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించి రెండూ వేరు వేరుగా సేకరించాలని అన్నారు.

పట్టణంలో రోడ్ల విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డివైడర్స్, మధ్యలో మొక్కలు నాటి నీళ్లు పొసి సంరక్షణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలని చెప్పారు.

ప్రతిచోట విషయ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు వాటర్ ట్యాంక్లు ఎప్పటికి అప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు.
పట్టణంలో ప్రజల సౌకర్యాల కోసం
పట్టణ ప్రకృతి వనాలు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నర్సరిల్లో అన్ని రకాల మొక్కలు అందుబాటులొ ఉంచాలని ప్రతి ఇంటికీ రెండూ మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని
తడి చెత్త- పోడి చెత్త సేకరణ పై
ప్రజల్లో అవగాహన కోసం ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్ధుల్ హమీద్, మున్సిపల్ కమిషనర్ కె. నరసింహా,
సిబ్బంది పాల్గొన్నారు
——————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి
జనగామ చే జారీ చేయ నైనది.

Share This Post