పట్టణ ప్రగతితో పట్టణాలు అభివృద్ధి బాటలో పయనించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

పట్టణ ప్రగతితో పట్టణాలు అభివృద్ధి బాటలో పయనించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా 4వ విడత పట్టణ ప్రగతి లో భాగం గా బుధవారం సంగారెడ్డి మున్సిపాలిటీ లో నిర్మిస్తున్న వైకుంఠదామం పనులను, పట్టణంలోని సిద్దార్థ్ నగర్, పోతిరెడ్డిపల్లీ ,ప్రశాంత్ నగర్, వడ్డెర కాలనీ లలో నిర్మిస్తున్న వైకుంఠదామం పనులను పరిశిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు.

మునిసిపాలిటీ లో నిర్మిస్తున్న వైకుంఠ ధామం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని , గ్రీనరీ పెంచాలని ఆదేశించారు. పట్టణంలో పూర్తిస్థాయిలో మొక్కలు నాటి హరిత పట్టణంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అదనపు కలెక్టర్ వెంట మునిసిపల్ కమిషనర్ చంద్ర శేఖర్, డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంతియాజ్ అహ్మద్, మునిసిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, స్థానిక కౌన్సిలర్స్, కాంట్రాక్టర్ లు ఉన్నారు.

Share This Post