పట్టణ ప్రగతిని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలి అధికారులు పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవు నాగారం మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి పనులను పర్యవేక్షించిన కలెక్టర్ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్

పత్రిక ప్రకటన

తేదీ : 03–06–2022

 

పట్టణ ప్రగతిని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలి

అధికారులు పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవు

నాగారం మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి పనులను పర్యవేక్షించిన కలెక్టర్

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేపడుతున్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల విషయాల్లో అధికారులు విధుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.

పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం జిల్లాలోని నాగారం మున్సిపాలిటీలో చేపడుతున్న పలు పనులను కలెక్టర్ హరీశ్ స్వయంగా పరిశీలించారు. నాగారం మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్, క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి దీనికి రూపొందించిన ప్లాన్ను పరిశీలించారు. నాగారం మున్సిపాలిటీలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం కోసం ఒకటిన్నర ఎకరాల (ఎకరంన్నర)లో రూ.4.50 కోట్లతో నిర్మాణం చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి మార్కెట్లో వెజ్కు సంబంధించి 26, నాన్ వెజ్కు 14, పూలు, పండ్లకు సంబంధించి 8 దుకాణాలను నిర్మించేలా అధికారులు తయారు చేసిన ప్లాన్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ మేరకు వెజ్, నాన్వెజ్ మార్కెట్ పనులను వేగవంతం చేసి త్వరితగతన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నాగారం మున్సిపాలిటీ పరిధిలో క్రీడా ప్రాంగణాన్ని కలెక్టర్ హరీశ్ సందర్శించారు. క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేయాల్సిన, చేపట్టాల్సిన పనులను సంబంధిత అధికారులకు సూచించారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తుగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని పదిహేను రోజులకోసారి సమీక్ష (రివ్యూ) సమావేశం నిర్వహించాలని మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేయాల్సి అవసరం ఉందని కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. దీంతో పాటు రాంపల్లిలో వైకుంఠధామాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ వైకుంఠధామం పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే వైకుంఠధామం మహాప్రస్తానంలా తీర్చదిద్దాలని నీటి వసతితో పాటు పచ్చదనం, సకల సదుపాయాలు అందులో ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్ హరీశ్ సూచించారు. పనుల విషయంలో కాంట్రాక్టర్ వేగవంతం చేయనట్లయితే వెంటనే వారిని తప్పించి వేరే కాంట్రాక్టర్కు పనులను అప్పగించి త్వరగా పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిలో అధికారులందరూ విధిగా తమకు కేటాయించిన ప్రాంతాల్లో పాల్గొనాలని ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, నాగారం మున్సిపల్ ఛైర్మన్ చంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వాణి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

 

Share This Post