పట్టణ ప్రగతి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్ధం

పట్టణ ప్రగతి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి…

మహబూబాబాద్, జూలై-23:

పట్టణ ప్రజల అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని పనులు వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నాలుగు మునిసిపాలిటీలు అయిన మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు పట్టణాల్లోని అభివృద్ధి పనులపై మునిసిపల్ చైర్మన్లు కమిషనర్లు తో కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా పారిశుధ్యం పై దృష్టి పెట్టాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు సకాలంలో విధులకు రాకపోతే సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకుంటామన్నారు నిరంతరం చెత్త సేకరణ జరగాలని డ్రైనేజీలు శుభ్రం చేయించాలన్నారు. వర్షాకాలంలో ప్రధాన రహదారులపై నే పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారని వార్డులలో చేపట్టడం లేదని పలు ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు అన్ని ప్రాంతాలను ఒకే రీతిలో పారిశుద్ధ్య పనులను చేపట్టాలన్నారు.

నీటి నిల్వ ఉన్న ప్రాంతాలపై చర్యలు తీసుకోవాలని ప్రైవేటు వ్యక్తులు అయితే నోటీసులు ఇవ్వాలని జరిమాన విధించాలన్నారు ప్రభుత్వ ప్రదేశాలలో రాళ్లు కలిపిన మొరం లోతట్టు ప్రాంతాలలో నింపడం చేయాలన్నారు అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల లో క్రిమికీటకాలు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రతిరోజు ఫాగింగ్ చేయించాలన్నారు. ఫాగింగ్ మిషన్ లను లేని చోట జనాభా ప్రాతిపదికన కొనుగోలు చేయాలన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలకు వాహనాలను కూడా సమకూర్చుకోవాలని అన్నారు.

మహబూబాబాద్, డోర్నకల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు వేగవంతం చేయాలన్నారు. నిర్దేశించుకున్న హరితహారం లక్ష్యాలను తప్పక క సాధించాలన్నారు. హోమ్ స్టీడ్ ప్లాంటేషన్ వేగవంతం చేయాలన్నారు. లేఅవుట్ ప్రదేశాలపై దృష్టి పెట్టాలని గ్రీనరీ ని అభివృద్ధి చేయాలన్నారు. కోవిడ్ కేసులను సమీక్షించారు ఆయా వార్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో భవనాలలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి పాజిటివ్ వ్యక్తులకు వసతులు కల్పించాలన్నారు ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలు ప్రతి వారం చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

రోడ్లపై వ్యక్తులు నిదురించకుండా ఉండేందుకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలలో తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేసి తరలించాలని అన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగే లోతట్టు ప్రదేశాల వద్ద బారికేడ్స్ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలన్నారు. సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. తాసిల్దార్ లో నిరంతరం పర్యవేక్షిస్తూ అందుబాటులో ఉండాలన్నారు.

గూగుల్ మీట్ లో శిక్షణ కలెక్టర్ అభిషేక్ అగస్త్య కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post