ప్రచురణార్థం
పట్టణ ప్రగతి ద్వారా ప్రతి వార్డ్ లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.
మరిపెడ,
మహబూబాబాద్, జూన్ -08:
పట్టణ ప్రగతి ద్వారా ప్రతి వార్డ్ లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం మరిపెడ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి పర్యటించారు. ముందుగా మరిపెడ మసీదు బజార్ లో మునిసిపల్ ద్వారా చేస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. డ్రైనేజ్ లను శుభ్రం చేయడంతో పాటు ఇళ్ల మధ్యలో ఉన్న చెత్తను తొలగించాలని, రోడ్డు పై, ఇళ్ల మధ్యలో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, వినని వారికి జరిమానాలు వేయాలని సూచించారు. డ్రైనేజ్ లు జాం అయిన చోట శుభ్రం చేయాలని, ప్రతి నెలలో ప్రణాళిక రూపొందించుకొని, స్పెషల్ క్యాంపెయిన్ లాగా పారిశుధ్యం, మొక్కలు ప్లాంటేషన్, నీటి పైపులు లీకేజీ లేకుండా నీటి సరఫరా కార్యక్రమాలకు షెడ్యూల్ రూపొందించుకొని పనులు చేయాలని తెలిపారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగణం ను పరిశీలించారు. ప్రాంగణంలో శిధిలావ్థలో ఉన్న డిగ్రీ కళాశాలను కూల్చివేతకు చర్యలు తీసుకొని ఆ ప్రాంతం శుభ్రంగా ఉంచి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అనంతరం జెడ్పీ సెకండరీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రహరీ గోడ చుట్టూ శుభ్రం చేసి పాత డిప్ పోల్స్ ను వాడుకలో తీసుకొని రావాలని సూచించారు.
ఆర్ అండ్ బి ముందు కూరగాయల అమ్మకందారులు రోడ్డు మీదనే అమ్ముతున్నారు అని, వారి కోసం వెండింగ్ జోన్ ఏర్పాటు చేయాలని, మరిపెడ లో పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఎంట్రన్స్ ఆర్చిలు ఏర్పాటు చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ సింధూర కుమారి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ కుమార్, ఆర్డీవో రమేష్,కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ టి. సుధాకర్, పి.హెచ్.డిఈ. ఎన్.పి.డి.సి.ఎల్., ఈ.ఈ., మిషన్ భగీరథ ఇంట్ర., గ్రిడ్., డివిజనల్, మునిసిపల్ అధికారులు, సంభందిత ఏజెన్సీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



