పట్టణ ప్రగతి పనులను వేగవంతం చేయాలి…

ప్రచురణార్ధం

పట్టణ ప్రగతి పనులను వేగవంతం చేయాలి…

మహబూబాబాద్, సెప్టెంబర్,23.

పట్టణప్రగతి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక అదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజ్ఞ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై సమగ్రంగా సమీక్షించారు.

మున్సిపాలిటీ లలో టాక్స్ సేకరణ,వీధి లైట్స్,రోడ్స్, ఇండ్లు, త్రాగునీటి కనెక్షన్లు వివరాలు సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.

మహబూబాబాద్ మున్సిపాలిటీలో 5 పార్క్ లు పూర్తి అయ్యాయని, నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ లను ఆదేశించారు. సెంట్రల్ లైటింగ్, పబ్లిక్ టాయిలెట్స్, సి.సి.రోడ్లు, డ్రైన్స్, హరితహారం లపై సమీక్షించారు. మొక్కలకు సపోర్టింగ్ కర్రలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అలాగే మొక్కలకు క్రింద పాదు చేయాలన్నారు. పార్క్ లలో బెంచీలు ఏర్పాటు చేయాలని, క్రీడా వస్తువులు ఏర్పాటు చేయాలని, గ్రీనరి కన్పించాలన్నారు. కాలనీ లలో పార్కులకు నిర్వహణ బాధ్యత కాలనీ వాసులు అసోసియేషన్ గా ఏర్పాటు చేసి అప్పగించాలన్నారు..అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.

తొర్రుర్ మున్సిపాలిటీ లో 20 కోట్లతో 12 పనులు చేపట్టగా 9 పనులు పూర్తి అయ్యాయని, అంగడి, పార్క్, మోడల్ మార్కెట్ ఉన్నాయని వీటిలో పార్క్ పూర్తి కాగా మోడల్ మార్కెట్, అంగడి పనులు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయన్నారు. 2 నర్సరీలు , 5 పట్టణ ప్రకృతి వనాలు పూర్తి అయ్యాయన్నారు. 4 శానిటేషన్ వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. టి.ఎస్.బి.పాస్ క్రింద దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.

మరిపెడ మున్సిపాలిటీలో 3 పబ్లిక్ టాయిలెట్స్ చేపట్టి 2పూర్తి అయ్యాయని, 1 చేపట్టవలసి ఉందన్నారు. గత సంవత్సరం 5 పట్టణ ప్రకృతి వనాలు చేపట్టి పూర్తి చేశామన్నారు. 2 బృహత్ పట్టణప్రకృతి వనాలు చేపడతామన్నారు. డి.ఆర్.సి.సెంటర్ ఏర్పాటు చేశామన్నారు.

డోర్నకల్ లో 2.39 కోట్లకు గాను 1.19 కోట్ల పనులు, 20 లక్షలు త్రాగునీటికి ఖర్చుచేస్తూ 60 శాతం గా ఉన్నామన్నారు. 2 ట్రాక్టర్ లు ఉండగా అవసరాల దృష్ట్యా మరో ట్రాక్టర్ కొనుగోలు చేశామని, 3 ఆటోలు ఉన్నాయని చెత్త సేకరణకు వినియోగిస్తున్నామన్నారు.

ఈ సమీక్ష సమావేశం లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మున్సిపల్ చైర్మన్లు మహబూబాబాద్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, డోర్నకల్ వీరన్న, మరిపెడ సింధూర, తొర్రుర్ రామచంద్రయ్య, మున్సిపల్ కమిషనర్లు మహబూబాబాద్ ప్రసన్న రాణి, డోర్నకల్ వెంకటేశ్వర్లు, మరిపెడ గణేష్, తొర్రుర్ గుండె బాబు, టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్, డి.ఈ.లు, ఏ.ఈ.లు పాల్గొన్నారు.
————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post