పట్టణ ప్రగతి పనుల్లో పురోగతి సాధించాలి:: జిల్లా కలెక్టర్ జి రవి

ప్రచురణార్థం—-3 తేదీ.06.11.2021

పట్టణ ప్రగతి పనుల్లో పురోగతి సాధించాలి:: జిల్లా కలెక్టర్ జి రవి


జగిత్యాల నవంబర్ 6:-

పట్టణ ప్రగతి పనుల్లో పురోగతి సాధించాలి:: జిల్లా కలెక్టర్ జి రవి

జిల్లాలోని 5 మున్సిపాలిటీలో చేపట్టిన పట్టణ ప్రగతి పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి పనుల పురోగతి పై శనివారం సంబంధిత అధికారులతో కలెక్టర్ జూమ్ సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రగతి కోసం ప్రభుత్వం ప్రతి మాసం నిధులను విడుదల చేస్తున్నది, వీటిని సద్వినియోగం చేసుకుంటూ చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

మన జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు రెండింతల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తామని , అయినప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి కనబడటం లేదని తెలిపారు. అక్టోబర్ చివరి వరకు జిల్లాలోని 5మున్సిపాలిటీలకు 58 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేయగా ఇప్పటివరకు 28 కోట్లు మాత్రం వ్యయం చేయడం జరిగిందని అన్నారు. గత నెల రోజులుగా జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో ఒక పనికి సంబంధించిన బిల్లు సమర్పించకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

మున్సిపాలిటీలో ఇంజనీర్లు , వర్క్ ఇన్స్పెక్టర్ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను రికార్డ్ చేసి వాటికి సంబంధించిన బిల్లులను వెంటనే తయారు చేసి అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ హరితహారం, పట్టణ ప్రగతి , పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై మున్సిపాలిటీల వారిగా సమీక్ష నిర్వహించారు.పారిశుద్ధ్య నిర్వహణ కోసం కొనుగోలు చేసిన వాహనాలు సర్వీసింగ్ , రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లాలోని పట్టణాల్లో మొదటి ప్రాధాన్యత గా వీధిలైట్ల పనులు పూర్తిచేయాలని, మున్సిపాలిటీల్లో వీధిలైట్ల మరమ్మతులు ఎప్పటికప్పుడు పూర్తిచేసే విధంగా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

సమావేశంలో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీ మాట్లాడుతూ పట్టణ ప్రగతి అభివృద్ధి పనులకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు నివేదికలో పొందుపర్చాలని తెలిపారు. 5 మున్సిపాలిటీలో పరిధిలో 55 స్మశాన వాటిక నిర్మాణ పనులు చేయాల్సి ఉండగా 3 మాత్రమే పూర్తి అయ్యాయని, దీని పై సంబంధిత గుత్తేదారులతో మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించి పనులు వేగవంతం చేయాలని ఆమె ఆదేశించారు. మున్సిపాలిటీలో వీధి వ్యాపారులకు అందించే రుణాలు పెండింగ్ ఉన్నవి అందించాలని, అదేవిధంగా సదరు రుణాలు రీపేమెంట్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ఓవర్ డ్యూ జరిగితే మెప్మా అధికారులు సామాజిక బాధ్యత వహించాల్సి ఉంటుందని అదనపు కలెక్టర్ తెలిపారు. పారిశుధ్య కార్మికులు అటెండెన్స్ బయోమెట్రిక్ ఉండే విధంగా చూడాలని, పారిశుద్ధ్య కార్మికులకు వర్క్ ఏరియా అలాట్ చేయాలని, దానికి వారినే బాధ్యత వహించాలని తెలిపారు. ధర్మపురి మున్సిపాలిటీలో బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటున్నట్లు రిపోర్ట్ చేయడం లేదని , వెంటనే సవరించాలని తెలిపారు. మున్సిపల్ శాఖ పరిధిలో మీసేవ సేవల కింద జిల్లా లో 80 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వీటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 5 మున్సిపాలిటీల పరిధిలో టి ఎస్ బి పాస్ కింద 1237 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 1123 పరిష్కరించామని మిగిలిన పెట్టండి పెండింగ్లో ఉన్నాయని అధికారులు తెలిపారు.బీపాస్ కింద అనుమతించిన నిర్మాణాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నారు లేదో తనిఖీలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు.

జిల్లాలోని మున్సిపాలిటీలో గ్రీన్ బడ్జెట్ కింద 7.07 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ 50 శాతం మేర నిధులు సైతం ఖర్చు చేయలేదని, పట్టణాల్లో ఏర్పాటు చేసిన మొక్కలకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని, నర్సరీల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. పట్టణాల్లో గత రెండు సంవత్సరాలుగా అవెన్యూ ప్లాంటేషన్ , ప్రభుత్వ సంస్థల్లో నాటిన మొక్కల వివరాలు, పార్కులలో నాటిన మొక్కలు వివరాలు, రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కల వివరాలను , వాటి సర్వైవల్ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ లోని ప్రతి వార్డులో పార్కు ఏర్పాటు చేయాలని తెలిపారు

మున్సిపల్ కమిషనర్లు సంబంధిత అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది

Share This Post