పట్టణ ప్రగతి లో చేపట్టి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

పట్టణ ప్రగతి లో చేపట్టి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం పట్టణ ప్రగతి లో భాగంగా కొడంగల్ మున్సిపాలిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే పనులు పూర్తయి ప్రారంభదశలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సామాజిక ఆరోగ్య కేంద్రం (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) లను సందర్శించి అధికారులకు తగు సూచనలు చేశారు త్వరలో ప్రారంభం కానున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో పెద్ద మొత్తంలో మొక్కలు నాటాలని అదేవిధంగా ప్రధాన రహదారి నుండి కళాశాల వరకు సి.సి రోడ్డు వేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. కొడంగల్ నుండి తాండూర్ రహదారికి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ చేయించాలని అదేవిధంగా డివైడర్ మధ్యలో పచ్చదనంతో ఉండేలా మొక్కలు పెంచాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ లో సమీకృత మార్కెట్ నిర్మాణం నిమిత్తం స్థలాన్ని పరిశీలించి ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 18 వరకు నిర్వహించే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన పనులన్ని పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొడంగల్ ఆరవ వార్డు లో గల పట్టణ నర్సరీ ప్రక్కన గల స్థలాన్ని క్రీడా ప్రాంగణానికి కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు సూచించారు. పట్టణ నర్సరీని సందర్శించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ మొక్కలను నాటారు. పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి స్థలాన్ని అదేవిధంగా కొత్తగా నిర్మాణం గావించిన సమీకృత మార్కెట్ ను పరిశీలించారు. నర్సరీల నిర్వహణపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పై కలెక్టర్ సూచనలు చేశారు.
కలెక్టర్ పర్యటన లో కొడంగల్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి విమల, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మున్సిపల్ చైర్ పర్సన్ ఉషారాణి , కౌన్సిలర్ సభ్యులు మధు యాదవ్ , శ్రీలత, డిప్యూటీ తాసిల్దారు సురేష్ , వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు

Share This Post