పట్టణ ప్రగతి లో బాగంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మున్సిపల్ పట్టణ పార్కులను మరియు నర్సరీలను పరిశీ లించి, మొక్కలు నాటిన కమీషనర్ మరియు డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్. ఎన్. సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ శృతి ఓజా .

You need to add a widget, row, or prebuilt layout before you’ll see anything here. 🙂

పత్రికా ప్రకటన                                                                  తేది:7.7. 2021

పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాలు మరింత సుందరంగా తీర్చి దిద్దాలని రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్, మున్సిపల్  అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ (ఐఏఎస్) పిలుపునిచ్చారు.

 బుధవారం నాలుగో విడత పట్టణ ప్రగతి లో భాగంగా ఏడవ రోజు గద్వాల పట్టణంలోని పలు వార్డులను ఆయన సందర్శించారు. ముందుగా జమ్మిచెడు గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించి హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అనంతరం గద్వాల లోని రాధా క్రిష్ణ కాలనీ, పాత హౌసింగ్ బోర్డు కాలనీ లోని పార్కులను సందర్శించి వన్ కిల్లోమీటరు వరకు  ఎర్రచందనం మొక్కలు ఒక వరుసలో నాటాలని ఆదేశించారు. 13వ వార్డు బురద పేట లోని పిల్లల పార్కు లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు మీ ఇంటి దగ్గర మొక్కలు నాటారా అని ప్రశ్నించారు. భావితరాల వారికి స్ఫూర్తినిచ్చే ప్రతి ఇంటికి మొక్కలు నాటుకోవాలి అని వారికి మొక్కలను అందజేశారు. పర్యావరణపరిరక్షణకు ప్రతి ఒక్కరు విదిగా మొక్కలు నటాలని  అన్నారు. వెంకంపేట రోడ్డు వెళ్లే రహదారిలో నర్సరీ కొరకు మార్కింగ్ ఇవ్వగా దానిని పరిశీలించారు. కొత్తగా ఏర్పాటుచేసిన నర్సరీలో ఇండ్లకు అవసరమయ్యే మొక్కలు నాటాలని అన్నారు. ఐజ రోడ్డు లోని రైల్వే స్టేషన్ క్రాసింగ్ దగ్గర మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే విదంగా  చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కలలుగన్న తెలంగాణకు హరితహారం  కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాలు మరింత అందంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శృతి ఓజా, అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డి ఇ  ఇంత్యాజ్ , కౌన్సిలర్లు శ్రీనివాసులు, త్యాగరాజు, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాలగారి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post