పట్టణ సుందరీకరణ పనులను చేపడుతున్నాం-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 20, 2021ఆదిలాబాదు:-
            ఆదిలాబాద్ పట్టణాన్నిమాడల్ సుందరీకరణగా తీర్చిదిద్దడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రాత్రి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద  40 లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన I ❤ ADILABAD సెల్ఫీ పాయింట్ ను ఎమ్మెల్యే జోగు రామన్న తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణాన్ని సుందరంగా ఏర్పాటు చేస్తామని, అన్ని జంక్షన్ లను సుందరంగా ఏర్పాటుచేసి పట్టణం అభివృద్ధి కి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ, పట్టణ జనాభాకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రానున్న రోజుల్లో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అనంతరం సెల్ఫీ లను తీసుకున్నారు ఈ సందర్బంగా బాణసంచాలను కాల్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, మునిసిపల్ కమీషనర్ శైలజ,  వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు.

Share This Post