పట్టణ స్థానిక సంస్థల పరిధిలో లే అవుట్ ల అనుమతులు, అడిటింగ్, పట్టణ అభివృద్ధిపై వీడియో కాన్ఫరెన్స్: రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ, వనపర్తి నుండి జిల్లా కలెక్టర్ షేక్ షేక్ యాస్మిన్ భాష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్

పత్రికా ప్రకటన                                                    తేది:20.7.2021
వనపర్తి.

పట్టణ స్థానిక సంస్థల పరిధిలో లే అవుట్ల ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ జిల్లా కలెక్టర్లను కోరారు.
మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణతో కలిసి జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. పట్టణ స్థానిక సంస్థల పరిధిలో లే అవుట్ ల అనుమతులు, అడిటింగ్, పట్టణ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుతూ 2014 సంవత్సరం తర్వాత అనుమతించిన లే అవుట్ ల ఆడిట్ నిర్వహణ చేయాలని, లే అవుట్ లలో 10 శాతం ఓపెన్ స్పెస్ స్థానిక పట్టణ సంస్థ పేరున రిజిస్టర్ చేయాలని ఆయన అన్నారు. 10 శాతం ఓపెన్ స్పెస్ కంటే తక్కువ ఉంటే లే అవుట్ ఒరిజినల్ డెవలపర్ నుండి ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం పెనాల్టీ విధించాలని ఆయన తెలిపారు. మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల పరిపాలన పరిధిలో పని చేయాలని, లే అవుట్ ల అనుమతులకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టాస్క్ పోర్స్ కమిటీకి సహకరిస్తూ రెగ్యులేటరీ విధులు నిర్వహించాలని ఆయన వివరించారు.

టి. యస్.బి పాస్ ద్వారా లే అవుట్ ల అనుమతులు నిర్దిష్ట సమయ పరిమితిలో మంజూరు చేయాలని అన్నారు. పట్టణ సంస్థలు పట్టణాలు ప్రణాళిక బద్దంగా అభివృద్ధికి పట్టణ రోడ్ నెట్ వర్క్ ప్లాన్,ఇన్ఫ్రాస్ట్రక్చర్, శానిటేషన్ ప్లాన్ లు రూపొందించాలని, పట్టణ ప్రాంతాలలో గ్రోత్ కారిడార్లు అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ కు స్థల సేకరణ చేయాలని, ప్రభుత్వ స్థలాలు ఉంటే గుర్తించి రాష్ట్ర పురపాలక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తే రాష్ట్ర స్థాయి నుండి టీమ్ పంపించి లే అవుట్ ల అభివృద్ధికి నియమ నిబంధనలు మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ పూలింగ్ పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు వర్క్ షాప్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా, దోమలు వృద్ధి చెందకుండా, మురుగుకాల్వలు పూడిక, ఫాగింగ్, ఆంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రతి ఆదివారం 10 ని.లు.పాటు దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలు, నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆనంతరం పట్టణ ప్రకృతి వనంలు ఏర్పాటు, నర్సరీల నిర్వహణపై సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ షేక్ షేక్ యాస్మిన్ భాష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
…………..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి నుండి జారీ చేయబడినది.

 

Share This Post