పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలు :: సాంఘీక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణా

జనగామ, డిసెంబర్ 3: పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితారాణా అన్నారు. శుక్రవారం కొడకండ్ల మండల కేంద్రములోని ఎస్సీ హాస్టల్ ను జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య తో కలిసి కమీషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు మంచి వాతావరణంలో విద్యా బోధనలు చేయాలని, వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
శీతాకాలం దృశ్య పిల్లలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్ లో మిగిలి ఉన్న చిన్న చిన్న మరమ్మత్తు పనులు పూర్తి చేసి రంగులు వేయించాలని అన్నారు. పిల్లలకు వ్యాయామం కోసం పరికరాలు తెప్పించాలని, లైబ్రరి ఏర్పాటు చేయాలని, క్రీడా పరికరాలు, స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచాలని అన్నారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక డైట్ ఏర్పాటు చేయాలన్నారు. కమీషనర్ విద్యార్థులతో ఎలా చదువు చెబుతున్నది, హస్టల్ లో అందుతున్న సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇష్టంగా కష్టపడి చదవాలని అన్నారు. పిల్లలకు ఉదయం సాయంత్రం ట్యూషన్ చెప్పేందుకు సంబంధిత సిబ్బందిని నియమించాలన్నారు. కరోనా నియంత్రణా చర్యలు ఖచ్చితంగా పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్
హన్మంతు నాయక్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కొర్నేలియస్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post