ప్రచురణార్థం
ఖమ్మం, జూన్, 6:
లక్ష్య సాధనకు పట్టుదలతో చివరి వరకు పోరాడాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం ఎస్ఆర్&బిజేఎన్ఆర్ కళాశాల ఆవరణలో తెలంగాణ సాహిత్య అకాడమి, తెలంగాణ బుక్ ఫెర్ సంయుక్త అధ్వర్యంలో నిర్వస్తున్న ఖమ్మం పుస్తక ప్రదర్శనలో భాగంగా యువతకు పోటీ పరీక్షలకు సన్నద్ధం ఎలా అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎప్పుడు వర్తమానం పై దృష్టి పెట్టాలని, గతం, భవిష్యత్తు గురించి ఆలోచన చేయవద్దని అన్నారు. వర్తమానం ఒక్కటే మన చేతుల్లో ఉంటుందని ఆయన అన్నారు. పోటీ పరీక్షల్లో మనకు సందేహాలు, భయాలు ఉంటాయని, వీటిని దరికి రానీయకుండా, జాగ్రత్త పడాలని అన్నారు. ఒకసారి ఫెయిల్ అయితే నిరాశా, నిస్పృహలకు గురికావద్దని, లక్ష్యం కొరకు చివరి వరకు పోరాడాలని అన్నారు. ప్రిపరేషన్ సమయంలో పుస్తకాలపై పూర్తి దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. మాక్ పరీక్షలు, ప్రాక్టీస్ పరీక్షలను సీరియస్ గా తీసుకోవాలన్నారు. ఒక రోజు గంటల తరబడి చదివి, మరుసటి రోజు చదవకుండా ఉండకుండా, ప్రతీ రోజు చదివే అలవాటు చేసుకోవాలన్నారు. ఎక్కువ మంది దగ్గర సలహాలు తీసుకోవద్దని, కొందరి సలహాలు, వారి వారి సామర్థ్యాన్ని బట్టి, వారు అన్వయించుకొని అమలు చేయాలని ఆయన అన్నారు.
కార్యక్రమంలో పోటీ పరీక్షలకు సన్నద్ధం పై యువత అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, పరీక్ష సక్సెస్ కావాలనే కోరిక మనసులో బలంగా వుండాలన్నారు. విజ్ఞాస జిజ్ఞాస మనలో వుండాలన్నారు. ఎంత సమయం చదివామన్నది కాదని, ఎంత క్వాలిటి చదువు చదివామన్నది ముఖ్యమని ఆయన అన్నారు. సిలబస్ పై ప;పూర్తి అవగాహన కలిగి వుండాలన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో విధానం ఉంటుందని, ఏ విధానం నచ్చితే దానిని అనుసరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, వైరా ఏసిపి రశ్మి పెరుమాళ్, మధిర అండర్ ట్రైన్ ఏసిపి సంకీర్త్, విద్యావేత్త ఐ.వి. రమణ, ప్రసేన్, బుక్ ఫేర్ కార్యదర్శి మోహన్, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.