పత్తి కొనుగోలుకు ప్రణాళిక రూపొందించుకోవాలి.

ప్రచురణార్థం

పత్తి కొనుగోలుకు ప్రణాళిక రూపొందించుకోవాలి.

మహబూబాబాద్, సెప్టెంబర్,30.

పత్తి కొనుగోలు సజావుగా జరిగేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు పై జిల్లాలోని మార్కెటింగ్ కార్యదర్శులు, జిన్నింగ్ మిల్స్ యాజమాన్యంతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 73,453 ఎకరాలలో 5,46,208 క్వింటాళ్ల పత్తి రానున్నదని అంచనా వేయడం జరిగిందన్నారు.

జిన్నింగ్ మిల్స్ నుండి 2,57,484 క్వింటాళ్ల పత్తిని సి.సి.ఐ. కొనుగోలు చేయనున్నదని,మార్కెట్ యార్డ్ ల నుండి 33,161 క్వింటాళ్ల పత్తి విక్రయాలు జరగనున్నాయని తెలియజేశారు.

ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పత్తి విక్రయాలు జరగనున్నందున అందుకు అనుగుణమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా పరిశీలించుకోవాలి అన్నారు టార్పాలిన్ లు సిద్ధంగా ఉంచుకోవాలని త్రాగునీరు మరుగుదొడ్ల సౌకర్యాలు ఉండేలా కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు.

పత్తి కొనుగోళ్లలో మాయిశ్చర్ మీటర్లు వేయింగ్ మిషన్ లు పని చేసేలా చూసుకోవాలి అన్నారు లీగల్ మెట్రాలజీ అధికారితో తనిఖీ చేయించుకోవాలని సూచించారు.

ఈ ముందస్తు సమావేశంలో అదనపు కలెక్టర్ కొమురయ్య జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి వెంకట్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, జిన్నింగ్ మిల్స్ యాజమాన్యం మార్కెటింగ్ శాఖ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు
————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post