పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి :జిల్లా కలెక్టర్ గోపి .

పత్తి కొనుగోలు ఏర్పాట్లు పక్క గా ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు .

సోమవారం ఎనుమాముల మార్కెట్ ని కలెక్టర్ సందర్శించి సంబంధిత అధికారులతో మార్కెట్ కమిటీ విధి విధానాలు, పత్తి కొనుగోలు కోసం చేయాలిసిన ఏర్పాట్ల పైన సమీక్షించారు.

గిడ్డంగుల గోదాం లు ఎన్ని ఉన్నాయి, వాటి సామర్ధ్యం వివరాలు,భవిష్యత్ లో గోదాంల సామర్ధ్యం సరిపోతుందా, లేదా, మార్కెట్ కి ఏమేమి పంటలు వస్తాయి, ట్రాన్స్పోర్ట్ వసతుల వివరాలను
ఈ సందర్బంగా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈవీఎం గోదాంని కూడా కలెక్టర్ సందర్శించి Vvpad లు సీల్ కరెక్ట్ గా ఉన్నాయా, లేదని పరిశీలించారు .

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ హరిసింగ్, మార్కెట్ చైర్మన్ భాగ్యలక్ష్మి, dmo సురేఖ, సెక్రటరీ చందర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post