పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

వానాకాలం 2021-22 సంవత్సరానికి గాను పత్తి కొనుగోలు కేంద్రాలు, ప్రైవేట్‌ సంస్థల వద్ద పత్తి కొనుగోలుతో పాటు
తరువాత అట్టి పత్తిని తరలించే ప్రక్రియ సంబంధిత అధికారుల సమన్వయంతో నమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశంతో కలిసి జిల్లా రవాణా, మార్కెటింగ్‌, పోలీను శాఖల అధికారులు, లారీ ఓనర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు, పత్తి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, జిన్నింగ్‌ మిల్లుల ఓనర్ల అసోసియేషన్‌ ప్రతినిధులతో సమీక్ష సనమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేసిన తరువాత జిన్నింగ్‌ మిల్లులకు తరలించి ప్రెస్సింగ్, బేళ్ళ తయారీ అనంతరం గోదాములకు, అక్కడి నుండి ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు తరలించవలసి ఉంటుందని, ఈ నేపథ్యంలో రవాణా చార్జీల సమస్య పరిష్కరించేందుకు మార్కెట్‌లో చార్జీలను ప్రన్తుతం మార్కెట్‌లో ఉన్న రేట్ల ప్రకారముగా అంచనా వేసి పూర్తి నివేదిక సిద్దం చేసి అందించాలని జిల్లా రవాణా అధికారిని ఆదేశించారు. పత్తి కొనుగోలు, తరలింపు సందర్భాలలో రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి, పోలీసు అధికారులు, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, రెబ్బెన లారీ ఓనర్ల అసోసియేషన్లు, జిన్నింగ్‌ మిల్లుల ఓనర్ల అసోసియేషన్ల ప్రతినిధులు, కాగజ్‌నగర్‌ ఎన్‌.పి.ఎం. అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post