పత్తి కొనుగోలు లో తూకం లో తక్కువ తూకం నమోదు చేసేలా మోసాలకు,అవకతవకలకు పాల్పడితే కేసులు నమోదు,చట్ట ప్రకారం కఠిన చర్యలు:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్* # తిరుమలగిరి మండలం లో పత్తి కొనుగోలు దారులు ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ లలో తక్కువ తూకం నమోదు చేసి కొనుగోలు. # జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తూనికలు కొలతలు శాఖ అధికారులు తనిఖీ,కొనుగోలు చేసిన వ్యక్తుల పై కేసు నమోదు *#వేయింగ్ మెషిన్ ల పై నిర్వాహకులు తూనికలు కొలతలు శాఖ సీల్ వేయించుకోవాలి

నల్గొండ, ఆక్టోబర్ 31. జిల్లాలో పత్తి కొనుగోలు చేసే వ్యక్తులు  తూకం లో మోసాలకు,అవకతవకలకు పాల్పడితే కేసులు   నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించారు. తిరుమల గిరి మండలం ఎల్లపురం లో లో  పత్తి కొనుగోలు చేసే వ్యక్తులు పత్తి పరిమాణం కన్నా ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ లలో సెట్ చేసి తక్కువ తూకం నమోదు చేసి కొనుగోలు చేస్తున్న సమాచారం జిల్లా కలెక్టర్ దృష్టికి రావడం తో జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లా తూనికలు కొలతలు శాఖ అధికారిని తనిఖీ చేయమని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా తూనికలు కొలతలు శాఖ అధికారి పి.రామకృష్ణ తనిఖీ నిర్వహించారు.అప్పటికే ఈ విషయం పై తిరుమల గిరి ఎస్.ఐ. పత్తి కొనుగోలు చేసే వ్యక్తుల
నుండి ఎలక్ట్రానిక్  వేయింగ్ మెషిన్ లను సీజ్ చేశారు. ఈ సమాచారం మేరకు తిరుమల గిరి పోలీస్ స్టేషన్ లో ఉన్న వేయింగ్  మెషిన్ లను జిల్లా తూనికలు,కొలతలు శాఖ అధికారి తనిఖీ చేశారు.ఒక వేయింగ్ మెషిన్ లో ప్రతి 20 కె.జి.లకు300 గ్రా.లు తక్కువ గా అనగా 19.700 కె.జి.లు చూపే విధం గా సెట్ చేయబడి ఉంది.ఈ వేయింగ్ మెషిన్ ఉపయోగించి ప్రతి 1000 కె.జి.లకు 15 కె.జి.లు అధనంగా తూకం వేసి రైతును మోసగించటం జరిగిందని అన్నారు.ఈ వేయింగ్ మెషిన్ ను ఉపయోగించిన  అంగోతు వాలా,అంగోతు స్వామి,అంగోత సర్దార్ ల పై  లీగల్ మెట్రాలజి చట్టం ప్రకారం తూనికలు,కొలతలు శాఖ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
*రైతులు వేయింగ్ మెషిన్ లకు లీగల్ మెట్రాలాజి సీల్ ఉందా,లేదా చెక్ చేసుకోవాలి*
రైతులు పత్తి అమ్మెటప్పుడు కొనుగోలు దారుల వద్ద వుండే వేయింగ్ మిషన్ లను,20 kg ల బాట్లను ఆ వేయింగ్ మెషిన్ పై ఉంచి దాని రీడింగ్ ను చెక్ చేసుకోవాలని లీగల్ మెట్రాలజి అధికారులు సూచించారు.అంతే గాక ఆ వేయింగ్ మెషిన్ కు సర్టిఫికేట్, లీగల్ మెట్రాలజి శాఖ సీల్ ఉన్నదా లేదా అనే విషయాన్ని  కూడా చెక్ చేసుకోవాలని అన్నారు.
ప్రస్తుతం వరి కొనుగోలు సీజన్ కావడం తో తూనికలు, కొలతలు శాఖ అధికారుల చే వే బ్రిడ్జి ల తనిఖీ లు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.వే బ్రిడ్జి నిర్వాహక్కులు వే బ్రిడ్జి లను మినిమం కెపాసిటీ నుండి మాక్సిమం కెపాసిటీ వరకు కరెక్ట్ గా పనిచేసేలా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వే బ్రిడ్జి ల లో ఎటువంటి తేడాలున్న వాటి పై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

పత్తి కొనుగోలు లో తూకం లో తక్కువ తూకం నమోదు చేసేలా మోసాలకు,అవకతవకలకు పాల్పడితే కేసులు నమోదు,చట్ట ప్రకారం కఠిన చర్యలు:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*
# తిరుమలగిరి మండలం లో పత్తి కొనుగోలు దారులు ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ లలో తక్కువ తూకం నమోదు చేసి కొనుగోలు.
# జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తూనికలు కొలతలు శాఖ అధికారులు తనిఖీ,కొనుగోలు చేసిన వ్యక్తుల పై కేసు నమోదు
*#వేయింగ్ మెషిన్ ల పై నిర్వాహకులు తూనికలు కొలతలు శాఖ సీల్ వేయించుకోవాలి

Share This Post