పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి- జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు

2021-2022 సంవత్సరానికి పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని కోర్ట్ హాలులో మార్కెటింగ్ , వ్యవసాయ శాఖ , జిన్నింగ్ మిల్లుల యజమానులు , పోలీస్ శాఖ , రవాణా శాఖధికారులతో 2021-22 సంవత్సానికి చేయాల్సిన పత్తి కొనుగోలుపై సమావేశం నిర్వహించారు .
ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పత్తి పంట లక్ష 29 వేల 818 ఎకరాలలో సాగు చేస్తున్నారని లక్ష 3 వెల 854 మెట్రిక్ టన్నుల పండుతుందని అంచనా వేశామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాల్ కు రూపాయలు 6025/- మద్దతు ధరను ప్రకటించిందన్నారు. జిల్లాలో 15 పత్తి కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్ మిల్లులకు తరలించి అక్కడ నుండి గోడౌన్ లకు తరలించాలని , కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టవలసిన చర్యలపై సూచనలు సంబంధిత అధికారులకు జారీ చేశారు.

ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయా దేవి , వ్యవసాయ శాఖ ఏ డీ ఏ విజయ లక్ష్మి , లీగల్ మెట్రోలజి అధికారి అనురాధ దేవి , జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి టీ . పూర్ణ చంద్ర , జిల్లా రవాణా శాఖ అధికారి ఈ వాసు , సీసీఐ ఇంచార్జి వర ప్రసాద్ , జిన్నింగ్ మిల్లుల యజమానులు , కాటన్ మార్కెట్ సెక్రటరీస్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share This Post