*పత్తి కొనుగోళ్ల పై సమీక్ష*

నల్గొండ, అక్టోబర్ 13. పత్తి పంటకు ప్రైవేట్ మార్కెట్ లో మద్దతు ధర లభించకుంటే మద్దతు ధర చెల్లించి నాణ్యత ప్రమాణాల మేరకు కొనుగోలుకు సిసిఐ అధికారులు సిద్ధంగా ఉన్నారని అదనపు కలెక్టర్ వనమాల చంద్ర శేఖర్ తెలిపారు. బుధవారం   జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో పత్తి కొనుగోళ్ల పై సి.సి.ఐ.,మార్కెటింగ్,పోలీస్,వ్యవసాయ శాఖ, తూనికలు, కొలతలు శాఖ అధికారులు,జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించి అదనపు కలెక్టర్ సమీక్షించారు. ప్రస్తుతం  పత్తి కి  ప్రైవేట్ మార్కెట్లో క్వింటాల్ కు 6,600 రూ.లు నుండి 6,800 రూ.లు  వరకు రైతు కు ధర వస్తున్నట్లు,   ఒకవేళ మద్దతు
ధర రాకుంటే,  6025 రూ.లు క్వింటాల్ కు మద్దతు ధర చెల్లించి పత్తి  కొనుగోలు చేసేందుకు సి.సి. ఐ అధికారులు సిద్ధంగా వున్నారని ఆయన వెల్లడించారు.సమావేశంలో రవాణా కు సంబంధించి  ఖర్చు విషయంలో రవాణా శాఖ అధికారులు,ట్రాన్స్పోర్ట్  యజమానులతో చర్చించి పరిష్కరిస్తామని, అలాగే  జిన్నింగ్ మిల్లులకు విద్యుత్ సరఫరా కు ఆటంకం లేకుండా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.అగ్ని మాపక శాఖ అధికారులు జిన్నింగ్ మిల్లుల ను తనిఖీ చేసి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా భద్రతా చర్యలు పరిశీలన చేయాలని ఆదేశించారు.తూనికలు కొలతలు శాఖ అధికారులు వే బ్రిడ్జి లను తనిఖీ చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో  మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి,  రవాణా శాఖ అధికారి సురేష్ రెడ్డి,తూనికలు, కొలతలు శాఖ ఇన్స్పెక్టర్ రామకృష్ణ,   జిన్నింగ్ మిల్లుల యజమానులు,సి.సి.ఐ. అసిస్టెంట్ మేనేజర్ మహబూబ్ నగర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post