పత్రికా ప్రకటన ఈ రోజు పంచాయతీ రాజ్ కమిషనర్ శ్రీ.డా.ఎ.శరత్ IAS గారు, జలాల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ క్రీడాప్రాంగణం ప్రదేశాన్ని సందర్శించారు. ఇట్టి సందర్బంగా ఆ ప్రదేశం బాగుందని జలాల్పూర్ తెలంగాణ క్రీడాప్రాంగణమును మోడల్ క్రీడాప్రాంగణంగా చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతి IAS, అడిషనల్ కలెక్టర్ శ్రీ.ధీపక్ తివారి IAS, అడిషనల్ కమిషనర్ శ్రీ ప్రసాద్, డిఆర్డిఓ శ్రీ.ఉపేందర్ రెడ్డి, అడిషనల్ డిఆర్డిఓ. శ్రీ.నాగిరెడ్డి, డిపిఓ శ్రీమతి. సునంద, ఎంపీడీవో ఏ బాల శంకర్, DLPO.శ్రీమతి.యం.సాధన, యంపిఓ.యండి. మజీద్, వైస్ యంపిపి. పి.వెంకటేష్ యాదవ్, గ్రామ సర్పంచ్ శ్రీమతి. పర్నె రజిత, APO,TAs,మరియు మండల పంచాయతీ కార్యదర్శులందరు పాల్గొన్నారు.
తెలంగాణ క్రీడాప్రాంగణం(TKP): ఇందులో భాగంగా ఖొ-ఖొ, కబ్బడి, వాలీ బాల్, మరియు లాంగ్ జంప్ సింగిల్ అండ్ డబుల్ బార్ ఎక్ససైజ్ వంటి క్రీడా సదుపాయాలు కల్పించడం జరుగుతుంది.
ఓపెన్ జిమ్: ఓపెన్ జిమ్ ప్రదేశాన్ని కూడా సందర్శించారు. ఇట్టి ప్రదేశము చాలా బాగుందని తెలియజేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP)తో దీన్ని మరింత అభివృద్ధి చేసి బోట్ సౌకర్యం కూడా కల్పించాలని తెలియజేశారు.
పల్లె ప్రకృతి వనం: పల్లె ప్రకృతి వనం సందర్శించి ఇది “చింతవనం” లాగా అభివృద్ధి చేయాలని తెలియజేశారు

Share This Post