పత్రికా ప్రకటన కొత్త కలెక్టరేట్లో పర్యటించిన కలెక్టర్

నిజామాబాద్, జూలై 30:–

జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నూతన సమీకృత కలెక్టరేట్ను సందర్శించి హరిత హారం పనులను పరిశీలించారు.

శుక్రవారం ఆయన నూతన సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో నాటిన హరితహారం మొక్కలను, పూల గార్డెన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంట్రెన్స్ లో బాగుందని, మొక్కల మధ్యలో ఉన్న గ్యాప్ లో కొత్త మొక్కలు నాటి ఫిలప్ చేయాలని, అదేవిధంగా ముందు వరుసలో ప్లాంటేషన్ మీడియం సైజ్ మొక్కలు ఉండాలని నిర్వహణ ఇంకా బాగుండాలి అన్నారు. బాక్స్ టైప్ లో రావాలన్నారు. వర్షం పడి వాటర్ ఆగే చోట పాడైన మొక్కల స్థానంలో నీటిలో తట్టుకునే మొక్కలను పెట్టాలన్నారు. మొక్కల మధ్య గ్యాప్ ఉండరాదు అన్నారు.
ల్యాండ్ లెవెలింగ్ లో అవసరమున్న చోట మట్టి వేసి మొక్కలు నాటాలి అన్నారు వర్షం నీళ్లు నిలవకుండా చూడాలన్నారు. అనంతరం బైపాస్ రోడ్డు మాధవ నగర్, ఆర్యనగర్, వినాయక నగర్ రోడ్లకు ఇరువైపులా రోడ్డు మధ్య డివైడర్ లో పెట్టిన మొక్కలను పరిశీలించారు.

కలెక్టర్ వెంబడి మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, ఆర్ అండ్ బి ఈ ఈ రాంబాబు, డి ఈ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Share This Post