పత్రికా ప్రకటన తేది 23.4.22,నల్గొండ ధాన్యం కొనుగోళ్ల పై కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ప్రారంభించిన అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్*

 : యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి  జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయం లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను శనివారం అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 241 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు కొనుగోలు  కేంద్రాల్లో ధాన్యం విక్రయం లో, గన్నీ బ్యాగుల కొరత,రవాణా,అన్ లోడింగ్,తరుగు,చెల్లింపు, కొనుగోళ్ల పై ఎటువంటి సమస్య ఉన్న *కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 9963407064 కు* సమాచారం అందిస్తే సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఉదయం   8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కంట్రోల్ రూం పని చేస్తుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్  కోరారు.ఈ కార్యక్రమంలో డి.అర్.డి. ఓ. కాళిందిని,జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా పౌర సరఫరాల సంస్థ డి.యం.నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు

Share This Post