*పత్రికా ప్రకటన*. నల్గొండ, 28.4.2022, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలో గురువారం నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తండ్రి కీ. శే. చిరుమర్తి నర్సింహ సంతాప సభకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించి,అనంతరం శాసన సభ్యులు చిరు మర్తి లింగయ్య స్వగృహం లో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు
సంతాప సభకు హాజరై నివాళులు అర్పించిన ప్రముఖులు రాష్ట్ర ఐటి, పురపాలక,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్వర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ లు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గోరటి వెంకన్న, ఎం.సి.కోటి రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాల జిల్లా పరిషత్ అధ్యక్షులు బండ నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, శ్రీమతి దీపిక యుగంధర్ రావు, ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్, శానంపూడి సైదిరెడ్డి, రవీంద్ర కుమార్, పైళ్ల శేఖర్ రెడ్డి,ఎన్. భాస్కర్ రావు, నోముల భగత్, బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మోత్కుపల్లి నర్సింహులు, తదితరులు ఉన్నారు.

సంతాప సభ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, సర్పంచులు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఉన్నారు.

Share This Post