పత్రికా ప్రకటన నూతన ఓటర్లు గా నమోదైన వారికి ఎపిక్ కార్డ్ లు పంపిణీ చేయాలి:రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్

నల్గొండ, 2022 జనవరి 12. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం లో భాగంగా 2022 జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సం. లు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు (ఎపిక్ కార్డు) లు బి.ఎల్.ఓ.ల ద్వారా అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్ లను కోరారు. బుధవారం హైద్రాబాద్ నుండి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నూతన ఓటర్ల నమోదు,కొత్తగా ఓటర్లు గా నమోదైన వారికి ఎపిక్ కార్డులు పంపిణీ తదితర విషయాల పై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు తో పాటు ఓటర్ కిట్ కూడా జాతీయ ఓటర్ దినోత్సవం జనవరి 25 లోగా నూతనంగా నమోదైన ఓటర్లకు అంద చేయాలని కోరారు. ఓటర్ కిట్ లో వ్యక్తిగత లేఖ,ఓటర్ గైడ్, ఓటర్ ప్రతిజ్ఞ,ఎపిక్ కార్డు కలిగి ఉంటుందని అన్నారు. ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని,18 సం. లు నిండి ఓటర్ నమోదు,మార్పులు,చేర్పులు,సవరణకు వచ్జిన దరఖాస్తులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏకరీతి గా ఫోటో లు ఉన్న జాబితా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో నూతన ఓటర్లు గా నమోదైన 5798 మంది కి జాతీయ ఓటర్ దినోత్సవం జనవరి 25 నాటికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు తో పాటు ,ఓటర్ కిట్ అందచేస్తామని తెలిపారు.జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజక వర్గాలలో 46,106 ఏకరీతి ఫోటో జాబితా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఓటర్ నమోదు,మార్పులు,చేర్పులకు వచ్చిన దరఖాస్తులు పరిష్కరిస్తామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్.డి.ఓ.జగదీశ్వర్ రెడ్డి, ఎన్నికల డి.టి.విజయ్ తదితరులు పాల్గొన్నారు

నూతన ఓటర్లు గా నమోదైన వారికి ఎపిక్ కార్డ్ లు పంపిణీ చేయాలి:రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్

Share This Post