You Are Here:Home→పత్రికా ప్రకటన సంగారెడ్డి, అక్టోబర్ 2:– ప్రపంచానికి అహింస,సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో గల జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి జెడ్పి చైర్ పర్సన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింస , శాంతియుత పోరాటం ద్వారా హక్కులను సాధించుకునే మార్గాన్ని చూపిన మహోన్నత వ్యక్తి జాతి పిత మహాత్మాగాంధీ యని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ భాగస్వాములు అవ్వాలని, గాంధీజీ చూపిన మార్గంలో నడిచి రాష్ట్ర, దేశాభివృద్ధికి చిత్తశుద్ధితో తోడ్పడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పీ సి ఇ ఓ ఎల్లయ్య, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
పత్రికా ప్రకటన సంగారెడ్డి, అక్టోబర్ 2:– ప్రపంచానికి అహింస,సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో గల జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి జెడ్పి చైర్ పర్సన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింస , శాంతియుత పోరాటం ద్వారా హక్కులను సాధించుకునే మార్గాన్ని చూపిన మహోన్నత వ్యక్తి జాతి పిత మహాత్మాగాంధీ యని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ భాగస్వాములు అవ్వాలని, గాంధీజీ చూపిన మార్గంలో నడిచి రాష్ట్ర, దేశాభివృద్ధికి చిత్తశుద్ధితో తోడ్పడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పీ సి ఇ ఓ ఎల్లయ్య, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.